అమ్మతో ఫోటోను షేర్ చేసిన హృతిక్.. నెటిజన్ కామెంట్!

1980లోనే బాలనటుడుగా చిత్ర పరిశ్రమకు పరిచయమై… మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాలు అందుకున్న గొప్ప నటుడు హృతిక్ రోషన్.తర్వాత తీసిన ఫిజా, మిషన్ కాశ్మీర్ వంటి మూవీల్లో చేసిన హృతిక్.

 Fan Spots Damp Wall Hrithik Roshan Rented House-TeluguStop.com

కభీ ఖుషీ కభీ గమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఇలా స్టార్ట్ అయిన హృతిక్ కెరీర్ కొన్ని సార్లు నెమ్మ దించినా… తర్వాత వచ్చిన ఛాన్స్ లతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.ఈ విధంగా తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించిన హృతిక్ .6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొని అందనంత ఎత్తుకు ఎదిగారు

భారత అత్యంత ఆకర్షణీయమైన నటునిగా పేరొందిన హృతిక్ రోషన్… స్టేజ్ పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చారు.చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు హృతిక్.జస్ట్ డాన్స్ అనే డాన్స్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.అంతే కాకుండా… ఆయన స్వంత దుస్తుల బ్రాండ్ ను కూడా ఆరంభించి….పలువురి ప్రశంసలు అందుకున్నారు.

 Fan Spots Damp Wall Hrithik Roshan Rented House-అమ్మతో ఫోటోను షేర్ చేసిన హృతిక్.. నెటిజన్ కామెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ లో గీకువీరుడుగా ఫేమస్ అయిన హృతిక్ రోషన్… క్రిష్ సీరీస్ లో బెస్ట్ రోల్ చేసి… దేశ వ్యాప్తంగా ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.అప్పటి వరకు కేవలం హిందీ ప్రేక్షకులకి మాత్రమే పరిచయమున్న హృతిక్….

సూపర్ హీరో సినిమాతో ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు.

Telugu Apartment In Juhu, Bollywood, Hrithik Roshan, Hruthik Roshan In Rented House, Hruthik Roshan Mother Pinky Roshan, Krish, Social Media, Viral-Movie

ఇదిలా ఉండగా.తాజాగా హృతిక్ రోషన్ ఇంట్లో తడి గోడ ఓ హాట్‌ టాపిక్‌గా మారింది.దానిపై ఆయన వివరణ ఇవ్వడంతో అది వైరల్‌గా మారింది.

హృతిక్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడని అందరికీ తెలుసిందే.అయితే ఆయన తన తల్లి పింకీ రోషన్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత ఓ ఫోటోను పోస్ట్‌ చేశారు.

ఆ సమయంలో ఆమె బాల్కనీలో నుంచి బయటకు చూస్తున్నారు.దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది.

అయితే ఓ అభిమాని మాత్రం అక్కడ గోడ తడిగా ఉన్న విషయం గుర్తించి కామెంట్‌ చేశాడు.

Telugu Apartment In Juhu, Bollywood, Hrithik Roshan, Hruthik Roshan In Rented House, Hruthik Roshan Mother Pinky Roshan, Krish, Social Media, Viral-Movie

దీనిపై స్పందించిన హీరో హృతిక్.తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్లు, త్వరలో సొంత ఇంటికి మారబోతున్నట్లు వెల్లడించాడు.అంతేకాకుండా తడి ఉంటే కదా దాన్ని రిపేర్‌ చేసే విధానాన్ని ఎంజాయ్‌ చేయెచ్చని అన్నారు.అయితే గతంలో జుహులోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దె ఉంటున్న ఈ అందగాడు దానికి రూ.8.25 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు ముంబైలోని ఓ మీడియా తెలిపింది.అనంతరం ఆయన మొత్తం 97.5 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్స్‌ కొన్నట్లు అదే మీడియా రాసుకొచ్చింది.

#Hrithik Roshan #Juhu #Krish #HruthikRoshan #Hruthik Roshan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు