అందుకే బాలయ్య  నన్ను కొట్టాడు.. అయినా చాలా హ్యాపీ గా ఉంది....

మామూలుగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ కి కోపం  కొంచెం కోపం ఎక్కువనే విషయం అందరికీ తెలుసు. దీంతో అప్పుడప్పుడు బాలయ్య బాబు బయటకు వచ్చిన సమయంలో తన అభిమానులను అదుపు చేసేందుకు ఒక్కోసారి కొట్టడం, తిట్టడం వంటివి చేస్తుంటాడు.

 Fan Reacted About Nandamuri Balakrishna Slap In Hindupur-TeluguStop.com

దీంతో కొందరు ఈ విషయాలను సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు షేర్ చేస్తూ బాలయ్య బాబు గురించి ట్రోల్స్ చేయడం, నెగటివ్ గా కామెంట్లు చేయడం వంటివి చేస్తుంటారు.  తాజాగా నందమూరి బాలకృష్ణ  తన అభిమాని పై చేయి చేసుకోవడంతో ప్రస్తుతం మరోమారు వార్తల్లో నిలిచాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోసమై ప్రచారం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ కార్యకర్తతో మాట్లాడుతుండగా ఓ అభిమాని వీడియో తీశాడు.

 Fan Reacted About Nandamuri Balakrishna Slap In Hindupur-అందుకే బాలయ్య  నన్ను కొట్టాడు.. అయినా చాలా హ్యాపీ గా ఉంది….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 దీంతో బాలయ్య బాబు అభిమానిని పిలిచి కొంతమేర మందలించి చెంపపై కొట్టాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే బాలయ్య బాబుతో చెంప దెబ్బ తిన్నటువంటి అభిమాని స్పందిస్తూ బాలయ్య బాబు తనని కొట్టినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, అంతేగాక తాను ఎంతగానో అభిమానించే హీరో చెయ్యి తాకినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.దీంతో కొందరు బాలయ్య బాబు అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ బాలయ్య బాబు అభిమానులంటే ఇలానే ఉంటారని, కానీ కొందరు గిట్టని వాళ్లు తమ అభిమాన హీరో గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తెలుగులో ప్రముఖ దర్శకుడు “బోయపాటి శ్రీను” దర్శకత్వం వహిస్తున్న ఓ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రభినయం చేస్తున్నాడు.

 ఆ మధ్య బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఈ చిత్రంలోని ఓ డైలాగ్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.దీంతో ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Fan Reaction #FanReacted

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు