మహేష్ కొత్త పోస్టర్‌తో అదరగొడుతున్న ఫ్యాన్స్  

Sarkaru Vaari Paata Mahesh Babu Parasuram - Telugu Mahesh Babu, Parasuram, Sarkaru Vaari Paata, Tollywood News

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేష్, ఇప్పుడు తన కొత్త సినిమాను డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

 Sarkaru Vaari Paata Mahesh Babu Parasuram

ఈ క్రమంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ‘సర్కారు వారి పాట’ టైటిల్ పోస్టర్ మరియు ప్రీలుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అయితే ఈ ప్రీలుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మహేష్ కొత్త పోస్టర్‌తో అదరగొడుతున్న ఫ్యాన్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఈ సినిమాలో మహేష్ లుక్‌పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమాలో మహేష్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయినప్పటికీ ఈ పోస్టర్‌లో మహేష్ లుక్ అదిరిపోవడంతో ప్రేక్షకులు ఈ లుక్‌ను తెగ షేర్లు చేస్తున్నారు.

నిజానికి సర్కారు వారి పాట ప్రీలుక్ పోస్టర్‌ను పూర్తిగా వినియోగించుకున్న ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అదిరిపోవడంతో ప్రేక్షకులు ఇది అఫీషియల్ పోస్టర్ అయ్యి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.ఏదేమైనా ఇలా ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో దుమ్ములేపుతుండటంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sarkaru Vaari Paata Mahesh Babu Parasuram Related Telugu News,Photos/Pics,Images..

footer-test