సమంత చేతిపై ఉన్న ఈ టాటూ అర్ధం మీకు తెలుసా.? సామ్ ఏమని వివరించింది అంటే.?       2018-07-02   03:29:14  IST  Raghu V

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ లో సమంత ఒకరు. ఇటివలే తన సినిమాలు హాట్రిక్‌ విజయాన్ని సాధించాయి. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తన స్పీడ్‌ తగ్గించలేదు. అక్కినేని ఇంటి కోడలిగా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు మంచి కథలను ఎంచుకుంటూ తనదైన శైలీలో ప్రేక్షకులను మెప్పిస్తూ కావల్సినంత ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అందిస్తుంది. తాజాగా సమంత తన చేతిపై ఉన్న టాటూ గురించి చెప్పింది.

ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘యూ టర్న్’ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, తన చేతిపై ఉన్న టాటూకు అర్థం చెప్పింది. అది తనకు, తన భర్తకు గుర్తుగా వేయించుకున్నదని, మేమిద్దరం అని, రియాలిటీలో ఉందామన్న అర్థం ఈ టాటూ వెనకుందని చెప్పింది. ఆన్ స్క్రీన్ మీద తామిద్దరం ఆర్టిస్టులం కాబట్టి, ఆఫ్ స్క్రీన్ లో రియాలిటీలో బతకాలన్నది తమ ఆలోచనని తెలిపింది. ఇదే విధమైన టాటూ చైతూ చెయ్యిపైనా ఉందని గుర్తు చేసింది.

కాగా ఇప్పటికే రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో వరుస హిట్‌ లు అందుకుంది. ప్రస్తుతం కన్నడ రీమేక్‌ యూటర్న్‌ చిత్రంతో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంలో మోడ్ర‌న్ జ‌ర్నలిస్ట్‌గా క‌నిపించ‌నున్న స‌మంత పాత్ర కోసం హెయిర్ క‌ట్ చేసుకున్న‌ట్టు కూడా తెలిపింది. మ‌హాన‌టిలో 30 సంవత్సరాల క్రితంనాటి మహిళా విలేకరి పాత్ర కోసం జ‌డ వేసుకుంద‌నే విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది. ప్ర‌స్తుతం త‌మిళంలోను ప‌లు ప్రాజెక్ట్స్ చేస్తుంది సామ్.