సెల్ఫీ అడిగాడు కదా అని దగ్గరకు రానిస్తే...అతను ఆ హీరోయిన్ ను ఏం చేసాడో తెలుస్తే షాక్.!       2018-06-14   03:36:42  IST  Raghu V

సెల్ఫీ..ఈ పిచ్చి ఉన్న వారు ఎక్కువే. ఎక్కడికి వెళ్లిన సెల్ఫీ దిగుతూ ఉంటారు.ఇక సెలెబ్రిటీలు కనిపిస్తే అస్సలు వదలరు. కానీ హీరోయిన్లు మాత్రం అభిమానులను దగ్గరకు రానివ్వకుండా పంపించేస్తున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం అభిమాని సెల్ఫీ అడిగాడు కదా అని దగ్గరకు రానిచ్చింది. కానీ అతను ఎంత నీచమైన పని చేసాడో తెలుసా.? వివరాలలోకి వెళ్తే…

తెలుగులో హీరో శివాజీ సరసస ‘తాజ్ మహల్’ చిత్రంలో నటించిన నుస్రత్ భరూచా పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో పలువురు అభిమానులు ఆమెను కలుసుకున్నారు. అయితే వారిలో ఒక వ్యక్తి సెల్ఫీకోసం ఆమెను రిక్వెస్ట్ చేశాడు. ఆమె సరే అనింది. ఫొటో దిగుతున్న సమయంలో అతను ఆమెకు మరింత సమీపానికి వచ్చి ఆమె నడుమును తాకాడు. దీంతో సుస్రత్ షాక్‌నకు గురైంది.

-

అయితే ఆమె టీంమెంబర్ అక్కడకు వచ్చి ఆ యువకుడిని మందలించి, డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సుస్రత్ మాట్లాడుతూ ‘నా రక్షణ భాధ్యతను ఈవెంట్ నిర్వాహకులకు అప్పగించాను. అభిమానులు నాతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు నాకు చేదు అనుభవం ఎదురైంది. నా టీమ్ సభ్యులు నన్ను కాపాడారు’ అని పేర్కొన్నారు.