సుధీర్ ను పెళ్లి చేసుకో అని ఓ అభిమాని అడిగితె...రష్మీ ఇచ్చిన ఈ రిప్లై చూస్తే షాక్ అవుతారు.!       2018-06-22   05:47:43  IST  Raghu V

ఎంతో ప్రజాకర్షణ కలిగివుండే సినిమా, టీవీ రంగాల్లో ప్రేమ వివాహాలు చాలా జరిగాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, పరస్పర అవగాహనతో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. అదే సమయంలో ఎవరన్నా అమ్మాయి, అబ్బాయి కొద్దికాలం కలిసి పనిచేస్తే వాళ్లపై ఊహాగానాలకు లెక్కే ఉండదు. ఆర్టిస్టులు కాబట్టి వాళ్లకు సంబంధించిన చిన్న విషయం అయినా ప్రజల్లోకి త్వరగా వెళుతుంది. కొందరు తమ మధ్య ఏమీ లేదని చెప్పినా, వాళ్లపై రూమర్లకు మాత్రం అడ్డుకట్టపడదు. అలాంటి వాళ్లే సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్. వీళ్లిద్దరి గురించి చెప్పుకోవాల్సి వస్తే… జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పాపులరైన సుధీర్, రష్మి తమ టాలెంట్ తో సినీ రంగంలో కూడా గుర్తింపు పొందారు.

టీవీ స్కిట్లే కాకుండా సినిమాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. అయితే వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇప్పటికీ ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్లిద్దరూ తమ మధ్య ఉన్న అనుబంధం ఏమిటో బయటపెట్టరు. కనీసం ఆ రూమర్లను ఖండించను కూడా ఖండించరు. దాంతో మరిన్ని ఊహాగానాలకు రెక్కలొస్తుంటాయి.

ఇది ఎప్పట్నించో జరుగుతున్న ఇష్యూ. లేటెస్ట్ గా ఓ టీవీ చానల్ లో అహ నా పళ్లంట ఉగాది స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఈ షోలో సుధీర్, రష్మి ఓ లవ్ సాంగ్ కు అదిరిపోయే రీతిలో పెర్ఫామ్ చేయడంతో యాంకర్ ప్రదీప్ తో పాటు అక్కడే ఉన్న నాగబాబు, రోజా, శేఖర్ మాస్టర్ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. ప్రతి అణువులోనూ చెప్పలేనంత ప్రేమ ఉంటే తప్ప ఆ రేంజ్ లో ప్రదర్శన ఇవ్వడం అసాధ్యం అన్న రీతిలో సుధీర్, రష్మి లవ్ ఒలకబోశారు.

ఇది ఇలా ఉంటె.. “రష్మి గౌతమ్… సుధీర్ ను పెళ్లి చేసుకో… మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు… ఇద్దరూ ఎంతో కష్టజీవులు… పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది” అని ఓ అభిమాని సలహా ఇచ్చాడు. దానికి రష్మి ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో చూడండి!

“మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఎలా చెబుతారు… స్క్రీన్ పై ఏదేదో చేసినంత మాత్రాన ఇద్దరి మధ్య ఏదో ఉందనుకుంటే ఎలా… ఎదగండి అభిమానులారా కాస్త ఎదగండి… రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా ఏంటో తెలుసుకోండి… స్క్రీన్ పై మేం ఏం చేసినా అది ఆడియన్స్ ను రంజింపజేయడానికే… ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది మేం నిర్ణయించుకోగలం… మీ సలహాలు అవసరంలేదు” అంటూ ఘాటుగా స్పందించింది

,