ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ మృతి.. సాహిత్య రంగంలో చోటు చేసుకున్న విషాదం.. !

గత కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న సీనియ‌ర్ జర్నలిస్ట్, రచయిత అనిల్ ధార్కర్ (74) ఈ రోజు ఉద‌యం కన్నుమూయడంతో సాహిత్య రంగంలో విషాదం చోటుచేసుకుంది.సీనియ‌ర్ జర్నలిస్ట్ గా ఐదు ద‌శాబ్దాల‌కు పైగా సేవ‌లు అందించిన అనిల్ ధార్కర్ కాల‌మిస్టుగా, ఎడిట‌ర్‌గా, టీవీ షో వ్యాఖ్యాత‌గా, ర‌చ‌యిత‌గా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు స‌ల‌హాల క‌మిటీ స‌భ్యుడిగా పనిచేశారు.

 Famous Writer Journalist Anil Dharker Dies Tragedy In The Field Of Literature ,-TeluguStop.com

ఇలా సాహిత్య రంగానికి అనిల్ ధార్కర్ ఎనలేని సేవలు అందించారు.కాగా దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘ది రొమాన్స్ ఆఫ్ సాల్ట్’ అనే పుస్తకం ధార్కర్ కలం నుండి జాలువారిందే.

ఇకపోతే మిడ్‌-దే, ది ఇండిపెండెంట్‌, ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా తో సహా పలు పత్రికలకు అనిల్ ధార్కర్ సంపాదికుడిగా పనిచేసారు.ధార్కర్ మృతి పట్ల పాత్రికేయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.

పత్రికా, సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube