టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పాతకాలం ఆలోచనలను పక్కన పెట్టి కొత్త విధానాలను అవలంభించు కుంటున్నాము.ఇది వరకు రోజుల్లో వాడే వస్తువులను, వాడే పద్దతులను మార్చుకుంటూ టెక్నాలజీని స్వాగతిస్తూ వస్తున్నాం పాతకాలం రోజుల్లో మన పెద్దవారు పెన్నులను వాడి పడేసేవారు కాదు.
మళ్ళీ వాటిల్లో ఇంక్ నింపి వాటినే వాడేవారు.అలా సంవత్సరాలు తరబడి అదే పెన్నులను ఉపయోగిస్తూ ఉండేవారు.
కానీ ఇప్పుడు మనం మాత్రం యూస్ అండ్ త్రో పద్దతిని అవలంభిస్తున్నాం.ఏ వస్తువునైనా ఇలా వాడడమే అలవాటు చేసుకున్నాం పెన్నులు కూడా అంతే ఇది వరకటిలా పెన్నులను ఇంక్ నింపి మరి మళ్ళీ వాడడం ఎప్పుడో మానేశారు ఇప్పుడు వచ్చే పెన్నులన్నీ అలా వాడేసి ఇలా పడేసేవే ఇప్పుడు ఉన్న యువత ఏదైనా వస్తువు పాడైతే బాగుచేయించుకుని మరి వాడడం లేదు వెంటనే ఆ వస్తువు స్థానంలో కొత్త మోడల్ వచ్చేస్తుంది.
అలాంటిది పెన్నులు పాడైతే బాగుచేయించు కుంటామా లేదు కదా కానీ పెన్నులు బాగుచేసేందుకు కూడా హాస్పిటల్ ఉందని మీకు తెలుసా.ఇది వినడానికి కాస్త కొత్తగా ఉన్నా నిజం.
పెన్ బాగుచేసేందుకు ఒక హాస్పిటల్ ను పెట్టారు.అది శ్రీకాకుళంలో ఉంది.ఇందులో పెన్నులు కూడా అమ్ముతారు.2 రూపాయల పెన్నుల దగ్గర నుండి 20 వేలఖరీదైనవి కూడా ఇక్కడ దొరుకుతాయి.

అక్కడ ఆ షాప్ లో కొనే పెన్నులకు ఏదైనా రిపేర్ వస్తే వాళ్లే లైఫ్ టైం ఫ్రీ గా రిపేర్ చేస్తారు.ఈ పెన్నుల షాప్ ను వాళ్ళ పూర్వికులు పెట్టగ ఇప్పటికి అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ షాప్ లో పెన్నులను ప్రొఫెషనల్ గా క్లీన్ చేయడం, ఇంక్ నింపడం వంటివి చేస్తుంటారు.ఇక్కడ పెన్నులకు అవసరమయ్యే అన్ని వస్తువులు దొరుకుతాయి.