త‌ల్లి అయిన ఫేమ‌స్ ఎంపీ.. మాజీ భ‌ర్త విషెస్‌

బెంగాలీ న‌టి అయిన నుస్రత్‌ జ‌హాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఎందుకంటే ఆమె నటిగా ఎంత ఫేమ‌స్ అయిందో ఆ త‌ర్వాత కూడా తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

 Famous Mp Who Is A Mother Ex-husband Wishes, Nusrath, Tmc Mp,latest News-TeluguStop.com

ఇక పోటీ చేసిన మొద‌టి ఎన్నిక‌ల్లోనే గెలిచి సంచ‌ల‌నం రేపింది.అయితే మొద‌టి నుంచి ఆమె పెండ్లి మ్యాట‌ర్ కాస్తా వివాధంగానే ఉండేది.

ఇక ఆమె త‌న భ‌ర్త‌కు కూడా విడాకులు ఇచ్చిన సంగ‌తి అంద‌రికీ విదితేమ‌.కాగా ఇప్ప‌డు ఆమె గురువారం పండంటి మ‌గ‌బిడ్డకు జ‌న‍్మనిచ్చి త‌ల్లి అయ్యారు.

దీంతో ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.

ఇక తాను బుధవారం రాత్రి త‌న ప్ర‌స‌వం కోంస ప‌శ్చిమ బెంగాళ్ రాజ‌దాని కోల్‌క‌తా లోని పార్క్ స్ట్రీట్‌లో గ‌ల‌ భగీరథి నియోతియా హాస్పిట‌ల్‌లో నుస్ర‌త్ చేరారు.

ఇక ఆమెకు డాక్ట‌ర్లు ఎంతో జాగ్ర‌త్త‌గా జేరియన్ చేసి డెలివ‌రీ చేశారు.దీంతో తల్లీ బిడ్డలు ఇద్దరూ కూడా డాక్ట‌ర్ల సంర‌క్ష‌ణ‌లో ఎంతో ఆరోగ్యంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కాగా ఈ స‌మాచారాన్ని అయితే ప్ర‌స్తుత బెంగాలీ న‌టుడు, నుస్రత్ ఫ్రెండ్ అయిన య‌ష్ దాస్‌గుప్తా త‌న ట్విట్ట‌ర్ వేదిక ద్వారా తెలిపారు.ఇంకేముంది దేశ వ్యాప్తంగా కూడా చాలామంది నుస్రత్‌కు సోషల్‌ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు.

Telugu Wishes, Latest, Nusrath, Park Street, Tmc Mp-Latest News - Telugu

ఇక నుస్ర‌త్ గ‌త జూన్ నెల‌లో బేబీ బంప్‌తో స‌హా ఫొటో షేర్ చేసి త‌న అభిమానుల‌కు విష‌యం చెప్పింది.ఇక ఇదే క్ర‌మంలో గురువార‌మే తాను హాస్పిట‌ల్ లో అడ్మిట్ అయిన విష‌యం కూడా వెల్ల‌డించింది త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా.ఇక ప్ర‌స్తుతం త‌న బాయ్‌ ఫ్రెండ్‌గా భావిస్తున్న దాస్‌గుప్తాయే ఆమెను హాస్పిట‌ల్ కు తీసుకెళ్లి మ‌రీ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు.ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే మాజీ భ‌ర్త నిఖిల్ కూడా నుస్ర‌త్ కు విషెస్ తెలిపారు.

త‌మ మ‌ధ్య ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఇప్పుడు పుట్టిన బాబుకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube