ప్రసిద్ధ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కన్నుమూత...

భారతదేశ ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభ నాయుడు కన్నుమూశారు.ఇటీవల కాలంలో ఆవిడకు కరోనా పాజిటివ్ కావడంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

 Prominent Kuchipudi Dancer Shobha Naidu Passes Away, Kuchipudi Dancer Shobha Nai-TeluguStop.com

చివరికి ఆరోగ్యం విషమించడంతో ఆవిడను వెంటిలేటర్ పై చికిత్స అందించారు.అయితే దురదృష్ట శాతం ఆవిడ ఆ చికిత్స నుండి కోలుకోక లేకపోవడంతో తుది శ్వాస విడిచారు.

ఇకపోతే శోభానాయుడు గారు గత కొద్ది రోజుల నుండి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్నట్టుగా ఆవిడ భర్త అర్జున్ రావు వెల్లడించారు.ప్రస్తుతం ఆవిడ వయసు 58 సంవత్సరాలు.


ఈవిడ బాల్యంలో చినసత్యం శిష్యురాలిగా అనేక ప్రదర్శనలు ఇచ్చేది.ఆవిడ నృత్యంలో కనపరిచిన అద్భుత ప్రదర్శనకు గాను భారత దేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును సైతం అందజేసింది.

అంతే కాదు ఆవిడ హైదరాబాద్ నగరంలో కూచిపూడి డాన్స్ అకాడమీ ఏర్పాటు చేసి ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు.ఈవిడ 1956 సంవత్సరంలో అనకాపల్లిలో జన్మించారు.ఈవిడ కూచిపూడి నృత్యం నేర్పించేందుకు ఆవిడ తల్లి ఎంతగానో సహకరించింది.12 సంవత్సరాల కఠోర సాధన తర్వాత ఆవిడ ఉన్నత శిఖరంలో నిలబడింది.

శోభ నాయుడు కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా వివిధ దేశాలలో తన నృత్య ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించారు.కూచిపూడి వైభవాన్ని తెలిపేందుకే ఆవిడ డ్యాన్స్ అకాడమీని ఏర్పాటు చేసి అనేక మందికి అందులో శిక్షణ ఇస్తోంది.ఈవిడ ఇంతవరకు 1500కు పైగా శిష్యులను తయారు చేసింది.40 సంవత్సరాలుగా వివిధ దేశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులను కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యులు గా తయారు చేసింది.2001 సంవత్సరంలో ఈవిడకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించింది.ఈవిడ మరణానికి అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube