ఫ్లై ఓవర్ పై సరదాగా చేసిన డాన్స్ వీడియోతో చిక్కుల్లో పడిన ప్రముఖ కమెడియన్.. !

చాలా మంది సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోవాలని రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు.విభిన్న లొకేషన్స్ లో తమకు నచ్చిన పెర్ఫార్మన్స్ ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించాలని చూస్తుంటారు.

 Famous Comedian Who Got Entangled With A Dance Video That Made Fun On The Flyov-TeluguStop.com

అయితే ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, కమెడియన్ చేసిన పని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.అతను తెలిసి చేసాడో తెలియక చేసాడో తెలియదు కానీ అతను పోస్ట్ చేసిన వీడియో చూసి పోలీసులు జరిమానా కూడా విధించారు.

ఇంతకీ అతను ఏమి చేసాడో తెలుసా రోడ్డుపై డాన్స్ చేసాడు.ఏంటి రోడ్డు మీద డాన్స్ చేస్తే తప్పు ఏంటి ఫైన్ ఎందుకు వేస్తారు అనుకుంటున్నారా.

అతను డాన్స్ చేయడం వరకు ఓకే గానీ ఎప్పుడు రద్దీగా ఉండే ఫ్లై ఓవర్ పై, ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించి మరీ డాన్స్ చేసాడు.ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేయిగా అది కాస్ ట్రాఫిక్ పోలీసుల కంట పడింది.

మరి ఆ నటుడు ఎవరు? ఏంటి అనే వివరాలు చూద్దామా.

బెంగాలీ నటుడు, కమెడియన్‌, సోషల్‌ వర్కర్‌ అయిన శాండీ సాహా డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

అది చూసిన కోల్‌కతా పోలీసులు తాజాగా ఆయనకు జరిమానా విధించారు.ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియోను ఒకసారి పరిశీలిస్తే ఈ ఘటన కోల్‌కతాలో భారీ ట్రాఫిక్‌ ఉండే మా ఫ్లై ఓవర్‌పై జరిగినట్లు తెలుస్తుంది.

ఆ ఫ్లై ఓవర్ పై శాండీ సాహా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.శాండీ మా ఫ్లైఓవర్‌పై కారు ఆపివేసి కారులోంచి దిగి రోడ్డుకు అటు వైపు వెళ్లి డ్యాన్స్ చేస్తూ ఒక బాలీవుడ్‌ పాట పాడటం కూడా మనం వీడియోలో గమనించవచ్చు.

అలాగే కలకత్తా ఫ్లై ఓవర్ పై నుంచుని ఇది కలకత్తా కాదు ఇది యూపీ అని బెంగాలీలో అతను అనడం కూడా ఈ వీడియోలో మనం గమనించవచ్చు. శాండీ ఇలా రోడ్డు మీద వాహనాలు వస్తున్నా.వాటిని పట్టించుకోకుండా దాదాపు 3.38 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై డాన్స్ చేయడం రికార్డు అయింది.ఇలా ఫ్లై ఓవర్ పై డాన్స్ చేయడం సరి కాదని చాలామంది నెటిజన్ల అభిప్రాయపడుతున్నారు.అంతేకాకుండా ఈ వీడియోను కొంతమంది యూజర్లు పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంచేత అతనికి, అతనితో పాటు ఉన్నా వ్యక్తులకు కూడా జరిమానా విధించారు.

కానీ ఈ విషయంపై శాండీ సాహా స్పందిస్తూ తాను ఏ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించలేదని అంటున్నారు.కాగా ఆ ఫ్లైఓవర్‌పై కారు నిలపడం అనేది చట్టరీత్యా నేరమని విషయం తనకు తెలియదని ఒప్పుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube