భార్యను హత్తుకుని ఏడ్చేసిన కమెడియన్ శివారెడ్డి.. టాలెంట్ ఉన్నా సక్సెస్ కాలేదంటూ?

నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో శివారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది.శివారెడ్డి దేశవిదేశాలలో 100కు పైగా సినిమాలలో నటించడంతో పాటు 3500 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు.

 Famous Comedian Shivareddy Emotional In Ismart Jodi Show Goes Viral , Interesting Comments , Ismart Jodi , Shivareddy , Show Goes Viral , Pittala Dora , Vasantham , Manasanta Nuvve , Athade Vaka Sainyam ,swathi , Tollywood Top Comedian ,ismart Jodi-TeluguStop.com

కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో జన్మించిన శివారెడ్డికి పాటలతో పాటు డ్యాన్సులు అంటే కూడా ఎంతో ఆసక్తి ఉండేది. 1994 సంవత్సరంలో పిట్టల దొర అనే సినిమాతో శివారెడ్డి నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

వసంతం, మనసంతా నువ్వే, అతడే ఒక సైన్యం సినిమాలు శివారెడ్డికి నటుడిగా మంచిపేరును తెచ్చిపెట్టాయి.అయితే తాజాగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ఇస్మార్ట్ జోడీ ఎపిసోడ్ లో శివారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.

 Famous Comedian Shivareddy Emotional In Ismart Jodi Show Goes Viral , Interesting Comments , Ismart Jodi , Shivareddy , Show Goes Viral , Pittala Dora , Vasantham , Manasanta Nuvve , Athade Vaka Sainyam ,swathi , Tollywood Top Comedian ,ismart Jodi-భార్యను హత్తుకుని ఏడ్చేసిన కమెడియన్ శివారెడ్డి.. టాలెంట్ ఉన్నా సక్సెస్ కాలేదంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శివారెడ్డి భార్య పేరు స్వాతి కాగా తనకు చాలా ప్రతిభ ఉందని అయితే లైఫ్ లో అడ్డంకులు ఎదురు కావడంతో వెనుకడుగు వేస్తుంటానని శివారెడ్డి చెప్పుకొచ్చారు.ఈ షోలో ఒక టాస్క్ లో భాగంగా శివారెడ్డి భార్య జాగ్రత్తలు తీసుకోకుండా మూకుడును కింద పెట్టారు.

అలా చేయడం వల్ల ఆమె రెండు చేతులు కందిపోయాయి.ఆ సమయంలో భార్యను కౌగిలించుకుంటూ ఎమోషనల్ అయిన శివారెడ్డి తన కష్టాలను చెప్పుకొచ్చారు.

భార్య వేడిగా ఉండే పెనంను కింద పెట్టిన సమయంలో తన ఫ్యూజులు ఔట్ అయ్యాయని శివారెడ్డి వెల్లడించారు.తన భార్య చేతివేళ్లను చూపిస్తూ శివారెడ్డి కనీళ్లు పెట్టుకున్నారు.

శివారెడ్డిని చూసి షోలో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్లు సైతం ఎమోషనల్ అయ్యారు.

శివారెడ్డికి ఉన్న ప్రతిభకు అతను టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా ఉండాలి.అయితే వరుసగా సినిమా ఆఫర్లను అందుకోవడంలో శివారెడ్డి ఫెయిల్ అయ్యారు.శివారెడ్డి కామెడీకి మాత్రం ఊహించని స్థాయిలో అభిమానులు ఉండటం గమనార్హం.

శివారెడ్డి వరుసగా ఆఫర్లతో బిజీ కావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube