ప్రముఖ నటి జయంతి కన్నుమూత..

సీనియర్ నటి జయంతి (76) కన్నుమూశారు.గత కొన్ని రోజుల నుంచి శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరు లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

 Famous Actress Jayanthi Eyelid-TeluguStop.com

జయంతి మరణంతో చిత్రపరిశ్రమకు తీరని లోటని, తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.కర్ణాటకలోని బళ్లారి లో పుట్టిపెరిగిన జయంతి అసలు పేరు కమలా కుమారి.

తెలుగు, కన్నడ, తమిళ , హిందీ మరాఠీ భాషల్లో సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించారు.తెలుగులో పెద్దరాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి యుద్ధం వంటి పలు చిత్రాల్లో నటించారు.

 Famous Actress Jayanthi Eyelid-ప్రముఖ నటి జయంతి కన్నుమూత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు  చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,రజనీకాంత్ చిరంజీవి మోహన్ బాబు అగ్ర కథానాయకుల సినిమాలో కీలక పాత్ర పోషించారు.జస్టిస్ చౌదరి, పెద్దరాయుడు, దొంగ మొగుడు,  కొండవీటి సింహం, అల్లూరి సీతారామరాజు , స్వాతికిరణం వంటి తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తన కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటిగా సహాయనటిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు.సినీ పరిశ్రమకు జయంతి అందించిన సేవలకు గుర్తించి కన్నడ చిత్ర పరిశ్రమ అభినయ శారద అనే బిరుదును ఆమెకు సత్కరించింది.

#Abinaya Sharada #Fim Actor #Jayanthi Died #Sandle Wood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు