మసాచుసెట్స్‌: ఐదుగురికాల్చివేత, మృతుల్లో ముగ్గురు చిన్నారులు  

family of 5 found dead in their Massachusetts home - Telugu Amily Of 5 Found Dead, Firing At Massachusetts Home, Massachusetts Home, Nri, Telugu Nri News Updates

మసాచుసెట్స్‌లో ముగ్గురు చిన్నారులు సహా వారి తల్లిదండ్రులు హత్యకు గురవ్వడం సంచలనం సృష్టించింది.ప్లైమౌత్ కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.

Family Of 5 Found Dead In Their Massachusetts Home

మరణించిన వారిని జోసెఫ్ జాకార్డి 43 అతని భార్య డీర్డ్రే జాకార్డి 40, వీరి పిల్లలు అలెక్సిస్ 11, మరియు నాథనియల్, కేథరిన్‌గా గుర్తించారు.

పిల్లలను అబింగ్టన్‌లో ఉన్న స్కూలుకు తీసుకెళ్లేందుకు వచ్చిన మరో కుటుంబసభ్యుడు మృతదేహాలను గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మసాచుసెట్స్‌: ఐదుగురికాల్చివేత, మృతుల్లో ముగ్గురు చిన్నారులు-Telugu NRI-Telugu Tollywood Photo Image

డిస్ట్రిక్ట్ అటార్నీ తిమోతి క్రజ్ మాట్లాడుతూ.పోలీసులు నిందితుడి కోసం వెతకడం లేదని అదే సమయంలో ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని .ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

డీర్డ్రే జాకార్డి బోస్టన్‌లోని ఈఎంఐ స్ట్రాటజిక్ మార్కెటింగ్ కంపెనీలో 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు.సాధారణ రీసెప్షనిస్ట్ స్థాయి నుంచి మేనేజర్‌గా ఎదిగిందని.బుక్‌కీపింగ్ నుంచి ఆన్‌బోర్డింగ్ వరకు ప్రతి పనిని నిర్వహించగలదని ఈఎంఐ ప్రెసిడెంట్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

మరోవైపు ముగ్గురు చిన్నారుల మృతిపై వారు చదువుకుంటున్న అబింగ్టన్ పబ్లిక్ స్కూల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

#NRI

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Family Of 5 Found Dead In Their Massachusetts Home Related Telugu News,Photos/Pics,Images..