ఒకప్పుడు సినిమాలో పాటలు ఏవైనా బాగా పాపులర్ అయితే.వాటిని కేవలం ఆ సినిమాల వరకే ఆదరించేవారు.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.అచ్చం ఆ సినిమాలో ఉన్నట్టు బయట కూడా అలాగే డ్యాన్సులు చేయడం మనం చూస్తున్నాం.
ఇలా పెండ్లిలో డ్యాన్సులు చేయడం కూడా బాగా పాపులర్ అవుతున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగా పాపులర్ కావడాన్ని కూడా మనం చాలా చూస్తున్నాం.
అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది.దాన్ని చూస్తే మీరు కూడా వావ్ అనకుండా ఉండలేరేమో.
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ప్యాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.అయితే ఇండియా వైడ్ గా మోస్ట్ వెయిటెడ్ మూవీగా ఉన్న ఆర్ఆర్ఆర్ లో ఉన్న నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.ఈ పాటలో చరణ్, తారక్ స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు.
కాగా వారిలాగా చాలా మంది స్టెప్పులేసి సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు.అయితే ఇప్పుడు ఓ పెండ్లి వేడుకలో ఇలా చాలా మంది స్టెప్పులు వేశారు.
ఈ మధ్య పెండ్లిలలో ఇలాంటి డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పుడు కూడా ఓ పెండ్లి వేడుకలో వరుడితోపాటు ఆ స్టేజి మీద ఉన్న బంధువులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్టెప్పులు వేశారు.
చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ ఆ పాటకు స్టెప్పులు వేయడంతో చాలా అందంగా కుదిరింది.దీన్నంతా కూడా అక్కడున్న వారు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.
దాన్ని చూసిన వారంతా కూడా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.వారి డ్యాన్స్‌కు మురిసిపోతున్నారు.
.