ఆ భారత సంతతి బిలినియర్ ఆచూకీకి 'భారీ నజరానా'..!  

Family Offers Sh44 Million To Find Abducted Mohammed Dewji-

కొన్ని రోజుల క్రితం అపహరణకి గురయిన భారత సంతతి బిలియనీర్ మహ్మద్ డ్యూజీ ఘటన ఎంతో చర్చకి దారితీసింది.అతడు ఒక జిమ్ నుంచీ రోజు వారి కార్యకలాపాలు నిర్వహించుకుని వస్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు అతడిని కిడ్నాప్ చేశారు..

ఆ భారత సంతతి బిలినియర్ ఆచూకీకి 'భారీ నజరానా'..!-Family Offers Sh44 Million To Find Abducted Mohammed Dewji

దాంతో ఒక్క సారిగా అందోళనకి గురయిన వారి కుటుంభం అతని ఆచూకి కోసం వేట ప్రారంభించింది.ఈ క్రమంలోనే.

మహ్మద్ డ్యూజీ ఆచూకీ చెప్పినవారికి భారీ మొత్తంలో డబ్బుని పారితోషకంగా అందించనుంది…ఇంతకీ వారు ప్రకటించిన నజరానా ఎంతో తెలుసా అక్షరాలా 3 కోట్ల రూపాయలు.ఈ డబ్బుని మొత్తంగా ఇచ్చేస్తామని ప్రకటించింది.

అయితే 43 ఏళ్ల మహ్మద్ డ్యూజీ మాజీ రాజకీయ నేతగా , పారిశ్రామిక వేత్తగా ఎంతో ప్రాచుర్యం పొందారు..

అంతేకాదు టాంజానియాలో ఏకైక బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత పిన్నవయస్కుడైన బిలియనీర్ డ్యూజీనే కావడం మరోక విశేషం.డ్యూజీ సేవా కార్యక్రమాలకి కూడా ఎంతో సాయం అందించే వారని అతడి సన్నిహితులు తెలుపుతున్నారు.