ఫామిలీ ముందు ఆ ఇద్దరు లవర్స్ ని బుక్ చేసాడు ట్రాఫిక్ పోలీస్.! తర్వాత ఏమైందో తెలుసా.?     2018-06-12   03:06:29  IST  Raghu V

ఫ్రెండ్స్ లవర్స్ గా మారడం చాలా కామన్. ఎన్నో సినిమాల్లో చూసాము. రియల్ లైఫ్ లో కూడా చూసాము. అలాగే క్లాస్ మేట్స్ అయిన మనోజ్, మమత కూడా ఫ్రెండ్స్ నుండి లవర్స్ గా మారారు. ఇంజనీరింగ్ అవ్వగానే ఇద్దరికి మంచి జాబ్స్ కూడా లభించాయ్. ఇక తమ మ్యాటర్ ఇంట్లో చెప్పాలనుకుంటున్నారు. కానీ మనోజ్ వాళ్ల నాన్న మూర్తి చాలా నిక్కచ్చి మనిషి. పూట గడవని పరిస్థితిల్లో హైద్రాబాద్ కు వలస వొచ్చి ఇప్పుడు మంచి కాంట్రాక్టర్ గా గౌరవ మర్యాదలు పొందుతున్నాడు. నాన్న అంటే మనోజ్ కు చాలా భయం. ఆయనకు ఎదరుగా ఒక్క మాట కూడా తలెత్తి మాట్లాడని గతం మనోజ్ ది.

మరోవైపు మమత ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అరె ఫ్లీజ్ రా.. మీ డాడీ తో మాట్లాడు …ఇక్కడ ఫోర్స్ ఎక్కువైపోతోంది అంటూ ఫోన్ లో మమత. ఫోన్ పెట్టేసిన మనోజ్ మూర్తి దగ్గరికి వెళ్ళి , డాడీ అన్నాడు. ఆ… చెప్పురా అంటూ తండ్రి ఫేస్ మనోజ్ వైపు టర్న్ ఇచ్చాడు. వెంటనే మనోజ్ ఏం లేదు డాడీ . ఎక్కడికి రెడీ అవుతున్నారు అని అడిగాడు. అప్పుడు మూర్తి… మా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా బైక్స్ మీద అలా సిటీ అవుట్ స్కర్ట్ కు వెళుతున్నాం సాయంత్రం వరకూ వచ్చేస్తాం అన్నాడు.

అంతలోనే…ఓ పది మంది మూర్తి ఫ్రెండ్స్ ఇంటి ముందు తమ తమ బుల్లెట్స్ బండ్లతో హరన్లు కొడుతున్నారు. అరెయ్ మనోజ్ ఈ రోజు ఆదివారమే కదా నీ బైక్ ఇవ్వు…అవసరమైతే కార్ వాడుకో అంటూ బైక్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళాడు మూర్తి. బండి స్టార్ట్ చేసి ఒకరి తర్వాత ఒకరు లైన్లో బయలుదేరుతున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు దగ్గరికి రాగానే పోలీసులు బండ్లను చెక్ చేస్తున్నారు…మూర్తి వాళ్ల గ్రూప్ లో అందరి పేపర్స్ చెక్ చేస్తున్నారు. అందరివి కరెక్టే ఉన్నాయ్.