సిగ్గు చేటు... వీర జవాన్‌కు వచ్చిన ఆర్థిక సాయం కోసం కుటుంబ సభ్యుల మద్య గొడవలు  

Family Members Fight About Indian Martyred Jawan Helping Fund -

పుల్వామా ఉగ్ర దాడిలో ఇండియన్‌ ఆర్మీకి చెందిన 40 మంది జవాన్‌లు మృతి చెందిన విషయం తెల్సిందే.దేశం మొత్తం ఏకం అయ్యి చనిపోయిన జవాన్‌ల కుటుంబాలకు ఆర్థిక సాయంను అందించేందుకు ముందుకు వచ్చారు.

Family Members Fight About Indian Martyred Jawan Helping Fund

కొన్ని లక్షల మంది తమకు తోచిన సాయంను రూపాయి రూపాయిగా ఇవ్వడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం నుండి కూడా భారీగానే వీర జవాన్‌ల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది.

ఇలాంటి నేపథ్యంలో వీర జవాన్‌కు ఇచ్చిన ఆర్థిక సాయం ఆయన కుటుంబ సభ్యులో వివాదంకు తెర తీసింది.

సిగ్గు చేటు… వీర జవాన్‌కు వచ్చిన ఆర్థిక సాయం కోసం కుటుంబ సభ్యుల మద్య గొడవలు-General-Telugu-Telugu Tollywood Photo Image

పెళ్లి అయ్యి కొన్ని నెలలే అయిన కర్ణాటక కు చెందిన గురు అనే జవాన్‌ మృతి చెందిన విషయం తెల్సిందే.ఆయన మృతితో సౌత్‌ ఇండియా మొత్తం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఇక వీర జవాన్‌ భార్య కళావతి తన భర్తకు సెల్యూట్‌ చేసి మరీ తుది వీడ్కోలు ఇచ్చి ది గ్రేట్‌ ఇండియన్‌ ఆర్మీ వైఫ్‌ అంటూ పిలవబడింది.

గురు ఫ్యామిలీ గురించి అంతా కూడా ఎంతో గొప్పగా చెప్పుకున్నారు.ఇలాంటి సమయంలో వీర జవాన్‌ కుటుంబ సభ్యులు డబ్బుల కోసం గొడవ పడుతూ, గురు భార్య కళావతిని వేదించడం సిగ్గు చేటు.

ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం మొత్తం కూడా రూల్‌ ప్రకారం కళావతికి వెళ్తుంది.దాదాపు రెండున్నర కోట్ల వరకు కళావతికి అందినట్లుగా తెలుస్తోంది.అయితే కొడుకు చనిపోవడంతో కోడలు తమను చూసుకుంటుందనే నమ్మకం లేదు.అందుకే మాకు కూడా ఆర్థిక సాయంలో వాటా ఇవ్వాలనేది గురు తల్లిదండ్రుల వాదన.

ఆర్ధిక సాయంలో వాటా ఇవ్వకుంటే తమకు కొడుకు వరస అయ్యే వ్యక్తిని కళావతి పెళ్లి చేసుకోవాలని గురు తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారట.దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కళావతి తనకు న్యాయం చేయాలంటూ కోరింది.భర్త పోయిన బాధలో ఆమె ఉంటే రెండవ పెళ్లి అంటూ అప్పుడే ప్రపోజల్‌ తీసుకు రావడం ఏంటీ అంటు గురు తల్లిదండ్రులపై జనాలు సీరియస్‌ అవుతున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు