ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఇంటి పై కుటుంబసభ్యులు దాడి

చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఇంటి పై దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు.

 Family Members Attacked The House Of A Married Couple-TeluguStop.com

చంద్రగిరి మండలం, పిచ్చినాయుడు పల్లి పంచాయితీ, మోహన్ రెడ్డి కాలనీకి చెందిన మోహనకృష్ణ గుంటూరు కు చెందిన డాక్టర్ సుష్మా ను రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు సుష్మాను తీసుకెళ్లేందుకు రెండు నెలలు పాటు వివిధ రకాలుగా ప్రయత్నించారు.

సుష్మా అంగీకరించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సుమారు 30 మంది అర్థరాత్రి మోహనకృష్ణ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.ఇంటి అర్థాలు, టీవీ, ఫర్నిచర్, తలుపులు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు.

గదిలో ఉన్న సుష్మా ను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు.మోహనకృష్ణ డైల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.పూర్తి సమాచారం విచారణ అనంతరం తెలుపుతామన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube