పవన్ రియల్ బిహేవియర్ బయటపెట్టిన నటుడు.. ఆ తేడా ఉండదంటూ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటనతో, క్రేజ్ తో కోట్ల సంఖ్యలో అభిమానులకు చేరువయ్యారు.ఈ స్టార్ హీరోను అభిమానించే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగడమే తప్ప తగ్గడం లేదు.

 Family Man 2 Actor Ravindra Vijay Comments On Pawan Kalyan-TeluguStop.com

చిరంజీవి తమ్ముడిగా కెరీర్ ను మొదలు పెట్టిన పవన్ తక్కువ సమయంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా పాపులారిటీని సంపాదించుకున్నారు.అయితే తాజాగా ఒక నటుడు పవన్ కళ్యాణ్ రియల్ బిహేవియర్ గురించి, గొప్పదనం గురించి చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే పవన్ సింపుల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.యంగ్ హీరోలతో పాటు స్టార్ ప్రొడ్యూసర్లలో కొంతమందికి పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో కావడం గమనార్హం.

 Family Man 2 Actor Ravindra Vijay Comments On Pawan Kalyan-పవన్ రియల్ బిహేవియర్ బయటపెట్టిన నటుడు.. ఆ తేడా ఉండదంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫ్యామిలీ మేన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటించి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవీంద్ర విజయ్ తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం.

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించి మంచి పేరును సొంతం చేసుకున్న రవీంద్ర విజయ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో ఎక్కువగా నటించారు.

పవన్ కళ్యాణ్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారని చిన్నా పెద్దా అనే తేడాను పవన్ కళ్యాణ్ చూపించరని అందరికీ ఒకే స్థాయిలో గౌరవం ఇస్తారని రవీంద్ర విజయ్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ టైమ్, కచ్చితత్వం ఉన్న నటుడని రవీంద్ర విజయ్ తెలిపారు.

Telugu Family Man2 Actor, Interesting Comments, Pawan Kalyan, Ravindra Vijay-Movie

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు టైటిల్ ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది.పవన్ కు జోడీగా నిత్యామీనన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.పవన్ క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుండగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

#Pawan Kalyan #Ravindra Vijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు