తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.వేరే జిల్లాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో ఈ కేసుల సంఖ్య కొంచెం అధికం.
కేసుల వ్యాప్తితో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది.ఒకే సారి కరోనాతో కుటుంబాలు ప్రాణాలు పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి.
కొందరు ఇంట్లో కరోనా సోకింది.తనకు కరోనా వచ్చిందనే భయంతో ప్రాణాలు విడుస్తున్నారు.
అయితే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.భర్త కరోనాతో మృతి చెందాడని భార్య ఆత్మహత్య చేసుకుంది.
నగరంలోని ఎల్లారెడ్డి గూడలో విషాదం నెలకొంది.తల్లిదండ్రులు మృతి చెందడంతో ఓ యువకుడు అనాథ అయ్యాడు.గత నెల 31 వ తేదీన ఆ యువకుడికి కరోనా సోకింది.దీంతో ఆగస్టు 4వ తేదీన ఆ యువకుడి నుంచి తండ్రికి కరోనా సోకింది.
దీంతో తండ్రి కొడుకులిద్దరూ ఇంటిపైన ఉన్న గదిలో హోం క్వారంటైన్ లో ఉన్నారు.తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో ఆగస్టు 6వ తేదీన మృతి చెందాడు.
అయితే భర్త కరోనాతో మరణించాడని, తనకు గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు రావడంతో కరోనా సోకిందనే భయంతో ఉంది.కొడుకు మరో సారి కరోనా పరీక్షలు నిర్వహించడానికి వెళ్లినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.