నటుడు అన్న తరవాత అనేక పాత్రల్లో కనిపించాల్సి ఉంటుంది.ఈ పాత్ర చెయ్యను ఆ పాత్ర చెయ్యనూ అనే హక్కు , స్వతంత్రం వారికి ఉన్నా కూడా కొన్ని కొన్ని పాత్రలు చెయ్యను అంటే అవకాశాలు రావడం తో పాటు తమలో ఉన్న టాలెంట్ ని చూపించుకునే ఛాన్స్ మిస్ అయిపోతారు.
ఈ మధ్య కాలం లో ఫామిలీ ఇమేజ్ ని పక్కన పెట్టి విలన్ గా మారిపోయి సూపర్ స్టార్ విలన్ క్యాడర్ లో ఉన్న జగపతి బాబు కి తండ్రి పాత్రలకంటే కూడా విలన్ పాత్రలే ఎక్కువ వస్తున్నాయ్.ఫ్యామిలీలను ముఖ్యంగా మహిళల్లో సూపర్బ్ ఇమేజ్ సంపాదించుకుని ఇలా విలన్ రోల్స్ చేయాల్సి వచ్చినపుడు మొదట భయపడ్డానంటున్నాడు జేబీ.
కానీ తన భయాలన్నీ రివర్స్ అయిపోయాయని.తను హీరోగా చేసినప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారని చెబుతున్నాడు.
ఆ లెక్కన చూస్తే.జగపతికి ముందు తరం లేడీస్ లో హీరోగా క్రేజ్ ఉంటే.
ఈ తరంలో అమ్మాయిలకు విలన్ గా తెగ నచ్చేశాడు.ఇది ఎవరికీ అందని అరుదైన ఇమేజ్ అని సంతోషిస్తున్నట్లుగా జగపతి బాబు చెబుతున్నాడు.