క్రిస్మస్ ట్రీ ముందు ఫ్యామిలీతో గన్స్ పట్టుకుని ఫోజులు.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిపై ట్రోలింగ్

Families Of Shooting Victims Slam Us Congressman For Christmas Photo With Guns

అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా వున్న అగ్రరాజ్యం అమెరికా .దేశంలో నానాటికీ పెరుగుతున్న గన్ కల్చర్‌‌కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది.

 Families Of Shooting Victims Slam Us Congressman For Christmas Photo With Guns-TeluguStop.com

నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.

ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.

 Families Of Shooting Victims Slam Us Congressman For Christmas Photo With Guns-క్రిస్మస్ ట్రీ ముందు ఫ్యామిలీతో గన్స్ పట్టుకుని ఫోజులు.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిపై ట్రోలింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు అగ్రరాజ్యంలో వైరల్‌గా మారింది.ముఖ్యంగా తుపాకీ కాల్పుల ఘటనల్లో బాధితులుగా మారిన వారి కుటుంబాలు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి.

రిపబ్లికన్‌కు కంచుకోటగా వున్న కెంటకికీ ప్రతినిధి అయిన థామస్ మాస్సీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటోలో క్రైస్తవ సోదరులు పరమ పవిత్రంగా భావించే క్రిస్మస్ ట్రీ ముందు కాంగ్రెస్ సభ్యుడి కుటుంబం తుపాకులు పట్టుకుని నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నారు.దీనికి ‘‘మెర్రీ క్రిస్మస్ .ప్లీజ్ శాంటా, దయచేసి మందుగుండు సామాగ్రి తీసుకురండి’’ అంటూ క్యాప్షన్ పెట్టారు.ఇటీవల పాఠశాలలో కాల్పుల ఘటన చోటు చేసుకున్న కొద్దిరోజులకే ఈ ఫోటోను పోస్ట్ చేయడంతో ఇది దుమారం రేపుతోంది.

నవంబర్ 30న మిచిగాన్ హైస్కూల్‌లో 15 ఏళ్ల యువకుడు సహచరులపై జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కెంటుకీకి చెందిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు జాన్ యార్ముత్ సైతం మాస్సీపై మండిపడ్డారు.

ఈ పోస్ట్ ‘‘అవమానకరమైనది’’ అని పేర్కొన్నాడు.

Telugu America, Victimsslam, Gun, Indians, John Yarmouth, Michigan School, Republican, Thomas Massie-Telugu NRI

ఇకపోతే అదే నవంబర్ 30వ తేదిన దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ఇంటిలో చోటు చేసుకున్న కాల్పుల్లో నలుగురు పిల్లలు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు.దీనికి సంబంధించి చిన్నారుల తండ్రిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ సోమవారం ప్రకటించింది.లాస్ ఏంజిల్స్ నగరానికి ఉత్తరాన వున్న యాంటెలోప్ వ్యాలీలోని లాంకాస్టర్‌లోని ఓ ఇంటిలో కాల్పులు జరిగినట్లుగా పోలీసులకు సమాచారం అందింది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ ఇంటిలో ఓ మహిళ, నలుగురు పిల్లల మృతదేహాలు కనిపించాయని షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.మృతుల్లో ఒక మహిళ, ఒక బాలిక, ముగ్గురు బాలురు వున్నారు.

వీరంతా తుపాకీ గాయాలతో మరణించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

#Michigan School #Republican #John Yarmouth #Gun #America

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube