కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.మోదీ పర్యటన సందర్భంగా పాలమూరులోని ప్రజాగర్జన సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తొమ్మిదేళ్ల పాలనలో రూ.9 లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులున్నారన్న ఆయన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తే హాజరు కావడానికి సీఎంకు తీరిక ఉండదని ఎద్దేవా చేశారు.
సీఎం తనకు,తన కొడుక్కి అధికారం ఉండాలంటారన్నారు.కేసీఆర్ గతంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు.
అదేవిధంగా కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి ఓటేసినట్లేనని స్పష్టం చేశారు.
.