అలారం మోగింది.. దెబ్బకు విమానం దిగింది  

False Fire Alarm Makes Indigo Plane For Emergency Landing - Telugu Emergency Landing, Fire Alarm, Indigo, National News, Plane

విమానాల్లో ప్రయాణం అంటేనే భయపడే ప్రజలు ఇక విమానం గాల్లోకి ఎగిరిన తరువాత దానికి ఏమైనా అయితే వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయని భయపడుతుంటారు.ఇలాంటి ఘటనలు మనం చాలానే చూశాం.

False Fire Alarm Makes Indigo Plane For Emergency Landing

కానీ ఓ తప్పుడు అలారం మోగడంతో గాల్లోకి లేచిన విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

చెన్నై నండి కువైట్‌కు వెళ్తున్న ఓ విమానం రన్‌వే నుండి టేకాఫ్ అయ్యింది.అది టేకాఫ్ అయిన 15 నిమిషాలకే అందులోని ఫైర్ అలారం మోగింది.దీంతో విమానంలో ఉన్న 160 మంది ప్రయాణికులు తమప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్నారు.వెంటనే అప్రమత్తమైన పైలట్లు అత్యవసరంగా విమానాన్ని తిరిగి చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

కాగా వెంటనే విమానాశ్రయ సిబ్బంది విమానంలో అగ్నిప్రమాదం ఏదైనా జరిగిందేమో చూడసాగారు.కానీ వారిని ఆశ్చర్యానికి గురిచేసిన అంశం ఏమిటంటే ఆ ఫైర్ అలారం చిన్న సాంకేతిక లోపంతో మోగిందని.

విమానంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు నిర్ధారించారు.దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

అటుపై ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పట్లు చేసినట్లు ఇండిగో యాజమాన్య తెలిపింది.

తాజా వార్తలు

False Fire Alarm Makes Indigo Plane For Emergency Landing-fire Alarm,indigo,national News,plane Related....