భార్య వలనే మద్యానికి బానిసయ్యా అన్న భర్త… విడాకులు పిటీషన్ స్వీకరించి కోర్టు  

False Complaints Of Harassment Against Husband And Family, High Court, Kerala, Relationship, Wife And Husband - Telugu

భార్య, భర్తల మధ్య ఆధిపత్యం, అవకాశవాదం ఒక్కోసారి వారి బంధం దూరం కావడానికి కారణం అవుతుంది.అలాగే భర్త తన తల్లిదండ్రుల కంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకునే భార్యలు చాలా మంది ఉన్నారు.

 False Complaints Of Harassment Against Husband And Family

అలాంటి భార్యల శాడిజం వలన కొంత మంది మగవాళ్ళు మానసిక ఒత్తిడి ఎక్కువై మద్యానికి బానిసలైపోతారు.చివరికి విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోతారు.

ఇప్పుడు కేరళలో ఓ భార్యాభర్తలు ఇలాగే విడాకుల కోసం కోర్టుకి ఎక్కారు.భార్య నుంచి విడాకులు కోరిన ఓ భర్త పిటిషన్ ను కింది కోర్టు కొట్టివేయగా, హైకోర్టు దాన్ని స్వీకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

భార్య వలనే మద్యానికి బానిసయ్యా అన్న భర్త… విడాకులు పిటీషన్ స్వీకరించి కోర్టు-General-Telugu-Telugu Tollywood Photo Image

కోడలితో పనులు చేయించడం, చేయమని చెప్పడం చాలా సాధారణమైన విషయమేనని, అంతమాత్రానికే వేరు కాపురం పెట్టాలని వేధించడం సరికాదని వ్యాఖ్యానించింది.

కేరళకు చెందిన ఓ యువకుడు, యువతికి 2003లో పెళ్లి అయ్యింది.

అత్తతో భార్యకి విభేదాలు రావడంతో వేరు కాపురం పెట్టాలని వేధింపులకి గురిచేసింది.భర్త అంగీకరించపోవడంతో ఆమె 2011లో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

భర్త ఇంటికి రమ్మని కోరిక రాకపోవడంతో విడాకులు ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టుకు ఎక్కాడు.

కోర్టులో విచారణ సాగగా, తనకు విడాకులు ఇవ్వాలన్న ఆలోచన లేదని, భర్త తో తనకు ఇబ్బంది లేదని, ఆయన తల్లితోనే తనకు సమస్యలు ఉన్నాయని కోర్టుకు చెప్పింది.

భర్తతో విడిగా ఉంటే తనకు సమస్యలు రాబోవని భార్య చెప్పింది.దీంతో విడాకులు ఇచ్చేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది.ఆపై భర్త హైకోర్టును ఆశ్రయించాడు.తన భార్య నలుగురి ముందూ తిడుతూ ఉండేదని, భర్తగా తాను పనికిరానని అనేదని, తనతో సన్నిహితంగా ఉండదని, ఆమె కారణంగానే తాను మద్యానికి బానిసను అయ్యానని చెప్పుకున్నాడు.

తనకి విడాకులు ఇప్పించాలని కోరాడు.భార్య ప్రవర్తనతో పిటిషనర్ సంతోషంగా లేడని తెలుస్తోందని, ఆయన భార్య కావాలనే గొడవలకు దిగినట్టుగా సాక్ష్యాలు చెబుతున్నాయని పేర్కొంటూ, విడాకుల పిటిషన్ ను హైకోర్టు స్వీకరిస్తున్నామని పేర్కొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

False Complaints Of Harassment Against Husband And Family Related Telugu News,Photos/Pics,Images..