విడ్డూరం : 16 సార్లు ఓటమి, 17వ సారి పోటీకి సిద్దం.... 20వ సారి గెలుస్తావని గురువు చెప్పాడట

మనది ప్రజాస్వామ్య దేశం, ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది.ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస అర్హతలు అయిన వయసు మరియు డిపాజిట్‌ కట్టేందుకు కొద్ది మొత్తంలో డబ్బు ఉంటే చాలు, ఎవరైనా కూడా పటీకి సిద్దపడవచ్చు.

 Fakkad Baba To Contest Election For 17th Time In Uttar Pradesh-TeluguStop.com

వయసు తక్కువ ఉంటే కుదరదు కాని, ఎంత ఎక్కువ వయసు ఉన్న వారు అయినా పోటీకి సిద్ద పడవచ్చు.వంద ఏళ్లు పైబడిన వారు కూడా పోటీలో నిలిచిన దాఖలాలు మన ఇండియాలో ఉన్నాయి.

ఇక గెలుపు లేకపోయినా పోటీ చేయాలని, రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు కొందరు పదే పదే పోటీ చేయడం మనం ప్రతి ఎన్నికల సమయంలో చూస్తూనే ఉంటాం.అయితే అందరిలోకి ఫక్కడ్‌ బాబా చాలా ప్రత్యేకం.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 75 ఏళ్ల ఫక్కడ్‌ బాబా ఇప్పటి వరకు అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం కలిపి 16 సార్లు పోటీ చేశాడు.ప్రతి సారి కూడా ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తూ వస్తున్నాడు.

యూపీలో బాబాలు ఎన్నికల్లో పోటీ చేయడం చాలా కామన్‌గానే జరుగుతుంది.అయితే పక్కడ్‌ బాబా మాత్రం గెలవను అని తెలిసి, నేను ఓడిపోతాను అంటూనే పోటీకి సిద్దం అవుతాడు.

త్వరలో జరుగబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఈ బాబా మరోసారి సిద్దం అవుతున్నాడు.మధుర లోక్‌సభ స్థానం నుండి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఈయన ప్రకటించాడు.

42 ఏళ్ల క్రితం మధుర లోక్‌సభ ఎన్నికల బరిలో మొదటి సారి నిలిచిన ఈ బాబా ఆ తర్వాత ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూనే ఉన్నాడు.చాలా సంవత్సరాల క్రితం ఈయన గురువు గారు 19 సార్లు ఓడిపోయిన తర్వాత 20వ సారి గెలుస్తావని, మంచి పదవి వస్తుందని చెప్పాడట.అందుకే త్వరలో 17వ సారి పోటీకి సిద్దం అయ్యాడు.ఈసారి కూడా తాను ఓడి పోతాను.పోటీ చేస్తాను కాని ప్రచారం అయితే చేయను, తాను 20వ సారి ఎప్పుడైతే పోటీ చేస్తానో అప్పుడు గెలుస్తాను అంటున్నాడు.

ఇప్పుడు 17వ సారి, 75 ఏళ్లు.అంటే మరో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి మూడవ సారి అంటే అప్పటి వరకు ఈయన వయసు 90లో పడేలా ఉంది.అప్పుడు గెలిచి మాత్రం ఈయన ఏం చేస్తాడని కొందరు జోకులు వేస్తున్నారు.

మరి కొందరు 20 సార్లు ఈయన పోటీ చేయగలడా, అప్పటి వరకు ఉంటాడా అని మరి కొందరు అంటున్నారు.మొత్తానికి ఎన్నికలు వచ్చిన ప్రతి సారి కూడా పక్కడ్‌ బాబా గురించి యూపీతో పాటు ఉత్తర భారతం మొత్తం కూడా చర్చ జరుగుతుంది.

సోషల్‌ మీడియా పరిధి పెరిగిన నేపథ్యంలో ఈసారి దేశ వ్యాప్తంగా ఫక్కడ్‌ బాబా గురించి తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube