హీరోయిన్ మోనాల్ పేరుని అలా వాడేసుకుంటున్న కేటుగాళ్ళు

టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కాని బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ అంటే ఎవరినే వెంటనే గుర్తు పడతారు.అల్లరి నరేష్ తో రెండు సినిమాలలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది.

 Fake Youtube Channel On Monal Gajjar Name, Tollywood, Telugu Heroines, South Bea-TeluguStop.com

అందులో సుడిగాడు కూడా ఒకటి ఉంది.ఈ సినిమా తర్వాత మోనాల్ కిఅవకాశాలు పుష్కలంగానే వచ్చిన ప్రేమ వ్యవహారంతో టాలీవుడ్ కి దూరమై మాతృభాష గుజరాత్ లో సినిమాలు చేసుకుంటుంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 4తో మరోసారి ఈ బ్యూటీ అందరి దృష్టిలో పడింది.ఇక ఈషోలో మరో పార్టిసిపెంట్ అఖిల్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా మోనాల్ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ షో నుంచి బయటకి వచ్చిన తర్వాత అల్లుడు అదుర్స్ మూవీలో ఐటెం సాంగ్ కూడా చేసింది.

ఇక ఈ మూవీ అవకాశాలు భాగానే వస్తున్నాయని తెలుస్తుంది.

అఖిల్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది.ఇక రియాలిటీషోలకి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా మోనాల్ పేరుతో యుట్యూబ్ లో మోనాల్ అఫీషియల్ అని ఒక ఛానల్ ని ఎవరో క్రియేట్ చేసి ఆమెకి సంబందించిన ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేయడం చేస్తున్నారు.సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్స్ చాలా వరకు ఉంటాయి.

కొంత వరకు వాటి ద్వారా తప్పుడు పనులకి కూడా కొంత మంది కేటుగాళ్ళు పాల్పడుతూ ఉండతారు.అయితే యుట్యూబ్ ఛానల్ గురించి సమాచారం తన వరకు రావడంతో మోనాల్ వెంటనే స్పందించింది.

తనకి ఎలాంటి యుట్యూబ్ ఛానల్ లేదని అది ఫేక్ అని సోషల్ మీడియాలో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube