ఫేక్ వీసా కేసులో విద్యార్ధులకి ఊరట...!!!

అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్మింగ్టన్‌ ఫేక్‌ యూనివర్సిటీ కేసులో అరెస్ట్ అయిన విద్యార్ధులకి అమెరికా కోర్టులో ఊరట లభించింది.ఈ నెల 20లోగా ఎవరికీ వారు స్వచ్చందంగా మీ మీ స్వదేశాల కి వెళ్ళిపొండి అంటూ తీర్పు చెప్పింది.

 Fake Visa Students Get Relaxed From American Announcement-TeluguStop.com

అయితే ఇద్దరు భారతీయులు ఒక పాలస్తీనా దేశ వ్యక్తి ముందస్తుగా వాలంటరీ డిపార్చర్‌ అనుమతి పొందారు.

మిగిలిన 17 మందిపై విచారణ జరిగింది.17 మందిలో దాదాపు 15 మందికి అందులో 8 మంది తెలుగు విద్యార్థులు వాలంటరీగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళే అవకాశాన్ని కోర్టు కల్పించింది.16వ యువతికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం కల్పించింది…అయితే ఆ యువతి స్వచ్చందంగా కాకుండా ప్రభుత్వం తరువున పంపుతున్నట్లుగా తెలిపింది.

ఇదిలాఉంటే 17వ విద్యార్థి యూఎస్‌ సిటిజన్ ని పెళ్లి చేసుకోవడంతో ,అతడి కేసుని ఆటను వాదించుకోవాల్సి ఉంటుంది.మిగిలిన 15 మంది విద్యార్థులు కోర్టు తీర్పుకు లోబడి స్వచ్చందంగా 20వ తేదీలోపు యూఎస్‌ వదిలివెళ్లాల్సి ఉంటుంది.దాంతో తెలుగు సంఘాలు తెలుగు విద్యార్ధుల ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తీ చేయాల్సిందిగా ఏపీ , తెలంగాణా ప్రభుత్వాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube