సర్వేలందు నకిలీ సర్వేలు వేరయా !  

Fake Surveys On Ap Elections-fake Survey\\'s,janasena,tdp,ysrcp,ఎన్నికల ఫలితాల,సర్వే

ఏపీలో ఎన్నికల తంతు అందరిని టెన్షన్ పెట్టేస్తోంది. పోలింగ్ తేదీకి ఫలితాల ప్రకటనకు మధ్య ఎప్పుడూ లేనంత సమయం ఉండడంతో ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎక్కడలేని టెన్షన్ లో ఉన్నారు. వీరందరిని మరింత టెన్షన్ పెట్టేలా ఏపీలో ఎన్నికల ఫలితాల పై రకరకాల విశ్లేషణలు , పార్టీల గెలుపోటములు, అవి సాధించే సీట్ల సంఖ్యకు సంబంధించి అనేక విశ్లేషణలు, సర్వేలు బయలుదేరాయి..

సర్వేలందు నకిలీ సర్వేలు వేరయా ! -Fake Surveys On AP Elections

అయితే ఆయా సంస్థలు ప్రకటిస్తున్న సర్వేల రిపోర్ట్స్ అందరిని అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే ఏ సర్వేకు ఆ సర్వే విభిన్న ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఒక సర్వేలో ఒక పార్టీకి వంద సీట్లు దాటితే మరో సర్వేలో ఇంకో పార్టీకి 130 సీట్లు వస్తున్నాయి. దీంతో ఏ సర్వే నిజమో ఏ సర్వే అబద్దమో తెలియని అయోమయం నెలకొంది.

మొత్తం అన్ని సర్వేల ఫలితాలను విశ్లేషిస్తే అందులో వాస్తవం కంటే కల్పితం ఎక్కువ ఉన్నట్టు అర్ధం అవుతోంది. నిజంగా ప్రజల నాడిని తెలుసుకొని చేస్తున్నవి కాదనే విషయం అందరికి అర్ధం అయిపోతోంది. చివరకు ఈ సర్వేలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే జనసేన పార్టీకి కూడా వందకు పైగా స్థానాలు వస్తున్నాయని కొన్ని సర్వే సంస్థలు ప్రకటించడం చూస్తుంటే అనుమానం ఆగ్రహం కలగక మానదు.

సాక్షాత్తు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తమ పార్టీకి పెద్దగా సీట్లు రావనే విషయాన్ని పార్టీ నాయకుల ముందే ఒప్పేసుకున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే నకిలీ సర్వేలకు అంతే లేదు. ఒక పార్టీకి వస్తాయని ఏ సర్వే సంస్థ అయినా ఫలితాలను ప్రకటించడం పాపం ఆ పార్టీ స్థానంలో తమకు ఇష్టమైన పార్టీ పేరును చేర్చేసి ఇదిగో మా పార్టీకి రాబోయే ఫలితాలు ఇవే అంటూ ప్రకటించేస్తున్నాయి.

ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో విశ్వసనీయత లేకపోయినా జనాలు మాత్రం ఆ సర్వేలు నిజమే అని భావిస్తున్నారు. ఏపీలో పార్టీలు, అభ్యర్థులకు తోడు కులాలు, మతాలు, సామాజిక పరమైన అంశాలు అన్నీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకొని అంచనాలు వెయ్యడం కష్టమైన పని.

కానీ చాలా సర్వే సంస్థలు తూతుమంత్రంగా సర్వేలను చేసి హడావుడిగా ఫలితాల ప్రకటన చేస్తున్నాయి. అయితే ఇందులో బోగస్ సర్వే సంస్థలే ఎక్కువగా ఉండడం ఈ గందరగోళానికి కారణం అయ్యి క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.