విడ్డూరం : 30 ఏళ్లుగా యువరాజుగా చెలామణి, పంది మాసం అతడి మోసాన్ని బట్టబయలు చేసింది

ఏదైనా మోసం కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు లేదా కొన్ని నెలల పాటు సాగుతుంది.కాని అతడి అదృష్టం బాగుండి ఏకంగా 30 ఏళ్లు సాగింది.అతడు చేస్తున్న మోసంను 30 ఏళ్ల పాటు ఎవరు గుర్తించలేక పోయారు.30 ఏళ్ల తర్వాత గుర్తించినా ప్రయోజనం లేకుండా పోయింది.అప్పటికే వందల కోట్లు అతడు హంఫట్‌ చేశాడు.ఆ డబ్బులు అయితే తిరిగి రాలేదు కాని అతడికి 18 సంవత్సరాల జైలు శిక్ష అయితే పడింది.

 Fake Saudi Prince Busted For Eating Fork-TeluguStop.com

అతడు చేసిన మోసం మామూలు మోసం కాదు.ఆర్థిక పరమైన మోసంతో పాటు, జనల మనోభావాలను కించపర్చే విధంగా చేశాడు.

విడ్డూరం : 30 ఏళ్లుగా యువరాజుగా

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమెరికా ఫ్లోరిడాలో ఆంటోనీ జిగ్నాక్ గత 30 ఏళ్లుగా తాను సౌదీ యువరాజును అని, తన కుటుంబీకులు సౌదీని పరిపాలిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.సౌదీలో ఎన్నో దేశాల కూటములు ఉంటాయి.అందులో ఒక దేశం తమ కుటుంబం ఆధీనంలో ఉంటుందని, చాలా ఖరీదైన దేశం తమది అంటూ చెప్పుకున్నాడు.తాను వ్యాపార రీత్యా అమెరికా వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు.అతడి మెయింటెన్స్‌ చూసి అంతా కూడా అతడు నిజంగానే యువరాజు అయ్యి ఉంటాడని భావించారు.

అలా అందరిని నమ్మించి చిన్న చిన్న మొత్తాలు, పెద్ద మొత్తాలను వ్యాపారంలో పెట్టుబడి పేరుతో తీసుకున్నాడు.

విడ్డూరం : 30 ఏళ్లుగా యువరాజుగా

వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంతో పాటు పలువురు అతడితో పరిచయం, అతడితో కలిసి తిరగడం కోసం భారీగా డబ్బులు ఖర్చు చేసే వారు.యువరాజుతో సన్నిహిత్యంకు ఎవరైనా ఆసక్తి చూపుతారు.తాజాగా ఒక బిల్డర్‌ అతడితో స్నేహం పెంచుకునేందుకు ప్రయత్నించాడు.

యువ రాజు అంటూ చెప్పుకుంటున్న వ్యక్తిని ఒక రెస్టారెంట్‌కు తీసుకు వెళ్లాడు.అక్కడ యువరాజు వారు పంది మాంసం ఆర్డర్‌ చేసి ఆబగా తినడం చూసిన బిల్డర్‌కు అనుమానం వచ్చింది.

విడ్డూరం : 30 ఏళ్లుగా యువరాజుగా

సౌదీకి చెందిన వారికి అసలు పందులు అంటేనే అసహ్యం.అలాంటిది ఇతడు పందిని ఇంత ఆబగా తింటున్నాడు ఏంటీ అంటూ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా మెల్లగా కూపీ లాగిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు.మొత్తంగా 100 కోట్ల రూపాయలను అతడు జనాల నుండి వసూళ్లు చేసి ఖరీదైన, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నాడు.30 ఏళ్లుగా అతడు సాగించిన లైఫ్‌ స్టైల్‌కు కనీసం 100 కోట్లు అయినా ఖర్చు అయ్యి ఉంటుంది.కోర్టు తాజాగా అతడికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube