బి అలర్ట్: ఫేక్ పేటీఎం తో చెల్లింపులు..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తూ అనేక ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సంఘటనలను మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం.ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ లో నకిలీ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే వారి అకౌంట్ లో నుంచి డబ్బులు మొత్తం స్వాహా చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు సిద్ధపడుతున్నారు.

 8persons Arrested For Cheating Shopkeepers With Fake Paytm App,  Fake Paytm App,-TeluguStop.com

ఒక్కోసారి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కానీ నకిలీ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకునే విధంగా ప్రజల నుంచి డబ్బులు స్వాహా చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కేటుగాళ్లు.ఈ తరుణంలోనే అచ్చం పేటీఎం యాప్‌ లాగానే నకిలీ యాప్ ద్వారా నగదును సొమ్ము చేసుకుంటున్న సంఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

సాధారణంగా ఆన్లైన్ లో నగదు చెల్లించడానికి ఉపయోగించే పేటీఎం కూడా ఒకటిగా మనం ఉపయోగిస్తున్నా ము.అచ్చం పేటీఎం లాగానే ఒక నకిలీ యాప్ ను సృష్టించి ఆ యాప్ ద్వారా సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడ్డారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.అచ్చం పేటీఎం యాప్  లాగానే ‘పేఏటీఎం స్ఫూప్’ అనే యాప్ ను ఉపయోగిస్తూ నగరంలో మూడు ముఠాలు మోసాలకు పాల్పడుతున్న పోలీసులు గుర్తించారు.

 సాధారణంగా పేటీఎం యాప్ తో చెల్లింపులు చేసినప్పుడు లావాదేవీలు పూర్తి అయిన అనంతరం ఆ విషయం పంపిన వ్యక్తికి ఫోన్ స్క్రీన్ పై స్పష్టంగా కనబడుతుంది.అంతేకాకుండా నగదు పంపిన కొద్ది సేపటికే ఆ వ్యక్తికి ఒక సందేశం రూపంలో వారికి తెలుసుకుంది.

ఇది ఇలా ఉండగా దుకాణాలలో క్యూఆర్ కోడ్ ఉపయోగించి డబ్బులను చెల్లించవచ్చు.

Telugu Cyber, Apps, Paytm App, Hyderabad, Paytm, Paytm Spoof, Shopkeepers-Latest

ఇలా సేమ్ అచ్చం పేటీఎం లాగానే మరో ‘పేఏటీఎం స్ఫూప్’ చెల్లింపులు జరుపుకోవచ్చు అని, స్కాన్ చేయడం ద్వారా సమస్యలు రావచ్చని దుకాణదారులకు నమ్మించి వారి పేరు, ఫోన్ నెంబరు తెలుసుకుని వాటిని ఈ నకిలీ యాప్ పొందుపరిచి, అచ్చం పేటీఎం లాగానే కనిపించినట్లు నగదు చెల్లించిన స్మార్ట్ఫోన్ లో వారికి చూపించేవారు.ఈ తరుణంలో ఒక దుకాణదారునికి ఎన్ని సార్లు నగదు పంపిన కానీ నగదు రాకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే పోలీసులను ఫిర్యాదు చేశాడు.కాంచన్ లో ఒక వస్త్ర దుకాణంలో 28 వేల రూపాయలు షాపింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

ఇలా దాదాపు ముఠాకు చెందిన 8 మంది దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించి వెంటనే రంగంలోకి దిగి అందరినీ అరెస్ట్ చేశారు.అలాగే ఇలాంటి కేటుగాళ్ల పట్ల దుకాణాదారులు చాలా జాగ్రత్తలు వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube