బేకార్ బిజినెస్ : అలా చాటింగ్ చేస్తూ లక్షలు సంపాదించవచ్చట.

ఈ మధ్యకాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు.ఈ క్రమంలో యువకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో పలు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.

 Fake Online Chatting With Money Earning Viral In Social Media, Social Media, Mo-TeluguStop.com

కాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైబర్క్రైమ్ పోలీసులను ఆర్థికంగా మోసపోయిన యువకులు సంప్రదిస్తున్న ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువగా ఉండటంతో కొందరు యువతులు తమ అందమైన శరీరాలను ఆయుధాలుగా చేసుకుని డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి నగ్నంగా ఫోటోలను మరియు వీడియోలను పంపుతూ గంటకి 500 రూపాయల నుంచి రూ.1000 చార్జ్ చేస్తున్నారు.అయితే ఇందులో కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా మాధ్యమాలలో మహిళలు షేర్ చేసిన ఫోటోలను తీసుకొని వాటిని అసభ్యకరంగా చిత్రీకరించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం.అయితే కొందరు మహిళలు మాత్రం వీడియో కాల్ మాట్లాడడానికి 300 రూపాయలు, వారి యొక్క అశ్లీల ఫోటోలు మరియు వీడియోలు పంపించడానికి రూ.500 ఇలా ఛార్జ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కొందరు యువతులు ఏకంగా నకిలీ ఖాతాల ద్వారా డైరెక్ట్ గా మెసేజ్ లు చేస్తూ వారి యొక్క సర్వీస్ చార్జీలను గూగుల్ పే, ఫోన్ పే వంటివాటి ద్వారా వసూలు చేస్తున్నారు.

-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

దీంతో పోలీసులు ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా మాధ్యమాలను వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు పంపించడం, ఫోటోలు పంపించడం అలాగే హద్దు మీరి ప్రవర్తించడం వంటివి చేయవద్దని ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube