సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సైకిల్ గర్ల్ హత్య? వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్

లాక్ డౌన్ సమయంలో తన తండ్రిని వెనుక కూర్చోబెట్టుకొని ఏకంగా 1500 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన జ్యోతి కుమారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆ వార్తతో ఆమె అంతర్జాతీయంగా ఫేమస్ అయిపొయింది.

 Fake News Viral On Cycle Girl Jyoti Kumari Murder, Social Media, Viral News, Cyc-TeluguStop.com

ఏకంగా అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంకా ట్రంప్ సైతం ఆమె సాహసాన్ని మెచ్చుకుంది.ఇక దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో జ్యోతికి విశేషమైన ప్రశంసలు లభించాయి.

ఇక ఆమెని సైకిలింగ్ అసోసియేషన్ కూడా ట్రయిల్స్ కి రమ్మని ఆహ్వానించింది.హిందీలో ఆమె బయోపిక్ ని ఆమెని లీడ్ రోల్ లో తెరకెక్కించడానికి ఓ దర్శకుడు రెడీ అయ్యాడు.

దీనిపై చర్చలు కూడా జరిగాయి.అయితే ఆమెని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసారంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయ్యింది.

ఆమె ఫోటోలతో పాటు, చనిపోయిన అమ్మాయి ఫోటోని యాడ్ చేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు.చాలా మంది ప్రముఖులు సైతం ఈ వార్త నిజమని ప్రచారం చేస్తున్నారు.

జస్టిస్ ఫర్ జ్యోతి హ్యాస్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని తేలింది.ఆమె పోలికలతో ఉన్న జ్యోతి పాశ్వాన్ అనే 16 ఏళ్ల బాలికని ఒక గ్యాంగ్ స్టార్ రేప్ చేసి హత్యా చేశాడు.

అయితే జ్యోతి అనే పేరు ఉండటంతో అందరూ జ్యోతి కుమారి చనిపోయింది అని భావించి ట్విట్టర్ లో వైరల్ చేశారు.ఫాస్ట్ చెక్ ద్వారా ట్విట్టర్ లో వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్ అని నిరూపణ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube