బొమ్మరిల్లు సిద్దార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. అసలేం జరిగిందంటే..?

బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగులో సిద్దార్థ్ లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.బొమ్మరిల్లు సక్సెస్ తరువాత సిద్దార్థ్ కు హీరోగా ఆఫర్లు మరింత పెరిగాయి.

 Fake News Goes Viral About Hero Siddharth, Fake News, Goes Viral, Siddharth, Soc-TeluguStop.com

అయితే సిద్దార్థ్ నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో ఆ తరువాత సిద్దార్థ్ తెలుగుతో పోలిస్తే తమిళంపైనే ప్రధానంగా దృష్టి పెట్టి తమిళ సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు.మాహాసముద్రం సినిమాతో సిద్దార్థ్ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

అయితే ఒక యూట్యూబ్ ఛానల్ సిద్దార్థ్ చనిపోయారంటూ థంబ్ నెయిల్ పెట్టడంపై నెటిజన్ల నుంచి, సిద్దార్థ్ అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వీడియోలో ఏం లేకపోయినా వ్యూస్ కోసం ఈ వీడియోను క్రియేట్ చేయడం గమనార్హం.

ఈ వీడియో గురించి హీరో సిద్దార్థ్ దృష్టికి రాగా సిద్దార్థ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించి ఈ వీడియో గురించి స్పష్టతనిచ్చారు.

చాలా సంవత్సరాల క్రితమే ఆ యూట్యూబ్ ఛానల్ కు తాను ఫిర్యాదు చేశానని అయితే అందులో ఎటువంటి అభ్యంతరకర అంశం లేదని వాళ్లు సమాధానమిచ్చారని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.బ్రతికున్న వాళ్లను చనిపోయారని చెబుతూ ఫేక్ థంబ్ నెయిల్స్ క్రియేట్ చేసిన వాళ్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.మరోవైపు మహాసముద్రం సినిమాతో సక్సెస్ సాధిస్తానని సిద్దార్థ్ భావిస్తున్నారు.

ఈ సినిమాకు సిద్దార్థ్ మూడు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నరని వార్తలు వచ్చాయి.కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ కోసం దిగజారుతూ బ్రతికి ఉన్నవాళ్లు చనిపోయినట్లు ప్రచారం చేస్తుండటం గమనార్హం.తెలుగుతో పోలిస్తే సిద్దార్థ్ తమిళంలోనే ఎక్కువగా సక్సెస్ అయినప్పటికీ సిద్దార్థ్ ను అభిమానించే వీరాభిమానులు తెలుగులో చాలామందే ఉన్నారు.అజయ్ భూపతి మహాసముద్రం సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాలని సిద్దార్థ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube