పది, ఐటిఐ పాసైన నిరుద్యోగులే టార్గెట్.. ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం..!

ప్రస్తుత సమాజంలో కష్టపడి సంపాదించే వారి కంటే జల్సాలకు అలవాటు పడి అడ్డదారులలో డబ్బు సంపాదించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది.

ప్రతిరోజు ఎంతోమంది అమాయకులు ఘరానా మోసాల బారిన పడుతున్నారు.

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన ఎంత కఠినంగా శిక్షించిన సమాజంలో దారుణాలు, అఘాయిత్యాలు, ఘరానా మోసాలు పెరుగుతూనే పోతున్నాయి.కాబట్టి ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న మనమంతా చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

ఇలాంటి కోవలోనే బెస్కాంలో( BESCOM ) మీటర్ రీడర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని నకిలీ నియామక పత్రాలు( Fake Appointment Letters ) ఇచ్చిన ఘటన కర్ణాటకలోని లింగసూగూరు తాలూకాలు వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

కర్ణాటకలోని( Karnataka ) దేవదుర్గ తాలూకా గుబ్బూరుకు చెందిన హసన్,( Hasan ) వేణు,( Venu ) నేతాజీ,( Netaji ) సురేష్, బసప్ప అనే వ్యక్తులు తాము కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆప్తులమంటూ పదవ తరగతి, ఐటిఐ పాసైన 15 మంది నిరుద్యోగ యువకులను నమ్మించారు.చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి బెంగుళూరు ఎంఎస్ భవన్ లో అభ్యర్థులకు నకలీ ఇంటర్వ్యూలు జరిపించారు.

Advertisement

ఇక లింగసూగూరు గ్రామానికి చెందిన విక్రమ్ సింగ్( Vikram Singh ) నుండి రూ.13 లక్షలు, శరణప్ప రూ.12 లక్షలు, ఆనంద్ రూ.6లక్షలు, ప్రభుగౌడ రూ.9 లక్షలు, దేవరాజ్ రూ.12లక్షలు, వెంకట సింగ్ రూ.12లక్షలు, రాజు రూ.7లక్షలు, రాహుల్ రూ.7లక్షలు, ముస్తాఫ రూ.3లక్షలు చొప్పున వసూలు చేశారు.అయితే ఐడియా ఇనఫిటి కంపెనీలో శిక్షణకు సిఫార్సు చేసినప్పుడు తాము మోసపోయాము అనే విషయం బాధితులు గ్రహించారు.

గురువారం బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు