ఏకంగా ఎస్పీ పేరునే వాడేస్తున్న నేర‌గాళ్లు.. ఫేక్ అకౌంట్‌తో వ‌సూళ్లు..!

ప్రజెంట్ సోషల్ మీడియా వరల్డ్‌లో అసలు ఏది? నకిలీ ఏది? అనేది గుర్తించడం రోజురోజుకూ కష్టతరంగా మారుతున్నది.నేరస్థులు ఆ మేరకు టెక్నాలజీ పట్ల పట్టు సంపాదించి ప్రజలను ఇంటర్నెట్ వేదికగా దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Fake Facebook Account In The Name Of Chittoor Sp Senthil Kumar, Cyber Criminals,-TeluguStop.com

ఇందుకు పలువురు ప్రముఖుల పేర్లను, వారి అకౌంట్లను వాడుకుంటున్నారు.మొత్తంగా సైబర్ నేరగాళ్లు పెరుగుతున్నారనే విషయం అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఏకంగా జిల్లా ఎస్పీ పేరిటనే నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేశాడు ఓ ఖిలాడీ సైబర్ నేరగాడు.ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలేంటి? తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాల్సిందే.

Telugu Chittoorsp, Cyber Criminals-Latest News - Telugu

ఈ ఫేక్ అకౌంట్స్ వల్ల ప్రముఖులు ఇబ్బందులు పడుతుండటం మనం గమనించొచ్చు.కానీ, పోలీసులూ ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫేక్ అకౌంట్ వల్ల సమస్యలొచ్చాయి.వివరాల్లోకెళితే.చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఫొటోతో ఫేస్‌బుక్‌ అకౌంట్ క్రియేట్ చేసి వీ.కోటకు చెందిన సునీల్ అనే యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు సైబర్ నేరగాళ్లు.రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో సునీల్‌కు సదరు అకౌంట్ నుంచి మెసేజెస్ వచ్చాయి.ఈ నేపథ్యంలోనే నకిలీ ఖాతా నుంచి గూగుల్ పే ద్వారా డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు సైబర్ నేరగాడు.ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ అయిందంటూ ఓ ఫొటో పోస్ట్ చేసి రూ.15 వేలు అడిగాడు.దీంతో ఎస్పీ డబ్బులు అడగడం ఏంటి? అని అనుమానమొచ్చి యువకుడు సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రంగంలోకి దిగిన పోలీసులు అది ఫేక్ అకౌంట్ అని గుర్తించారు.

సైబర్ నేరస్థుడు అకౌంట్ నుంచి ఎవరెవరికి మెసేజ్‌లు పంపాడు? ఎంత మంది నుంచి మనీ కలెక్ట్ చేశాడు? అనే విషయమై ఎంక్వైరీ చేస్తున్నాడు.చూశారా? సైబర్ నేరస్థుల వల్ల జిల్లా ఎస్పీ పేరు బాదనాం అయింది.కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతులై అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube