బిగ్ బాస్ 4: అఖిల్ ఎలిమినేషన్.. అంతలోనే..?!

ఎప్పటిలాగానే బిగ్ బాస్ తో సహా బిగ్ బాస్ హోస్టు కింగ్ నాగార్జున కూడా మరోసారి ఆడియన్స్ ను భ్రమలో ఉండేలా చేశారు.మొదటిగా ఎలిమినేషన్ అంటూ ప్రక్రియను మొదలు పెట్టి ఆ తరువాత నమ్మించి మరి చివరికి ట్విస్ట్ ఇచ్చాడు కింగ్ నాగార్జున.

 Bigboss House, Nagarjuna, Akhil, Elimination, Sohail, Monal, Bigg Boss Akhil Fak-TeluguStop.com

మూడు రోజుల క్రితం బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ ను ఎలిమినేట్ చేయించి సీక్రెట్ రూమ్ లో ఉంచి, ఆ సీక్రెట్ రూమ్ లో నుండి మిగతా కంటెస్టెంట్ స్వరూపాన్ని చూశాడు అఖిల్.అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున అఖిల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చి తెలుగు ప్రేక్షకులని ఒకింత అయోమయానికి గురి చేశాడు.

ముందుగా సభ్యులు ఎలిమినేషన్ చేసిన కారణంగా అఖిల్ ను హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యావని దానికోసం తనకు సంబంధించిన వస్తువులు అన్నీ సర్దుకొని ఆ తర్వాత సభ్యులతో సెల్ఫీ తీసుకొని స్టేజ్ మీదకి రమ్మని అఖిల్ కు నాగార్జున తెలిపాడు.

Telugu Akhil, Bigboss, Monal, Nagarjuna, Sohail-Latest News - Telugu

హౌస్ సభ్యులందరు పెద్ద తప్పు చేశారని నాగార్జున చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ ఇచ్చిన కండిషన్ ను నాగార్జున చెబుతూ మొదట, గేమ్ లో ఎవరు వెళ్లిపోవాలనుకుంటున్నారని, మరోటి హౌస్ లో మీకు అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు అనేది, ఆ తర్వాత ఫైనల్ లో మీతో పోటీ పడే వాడు ఎవరనేది అని తెలుపుతూ.ఇందుకు సంబంధించి ఇంట్లోని సభ్యులందరూ తమకు తామే ఇష్టానిగా మాట్లాడుకోవడం ఏంటని నాగార్జున సభ్యులకు ఫుల్ క్లాస్ పీకారు.

నిజానికి అఖిల్ కు నాగార్జున నువ్వు ఎలిమినేట్ అని చెప్పగానే అఖిల్ షాక్ గురయ్యాడు.ఇందుకు సంబంధించి అఖిల్ ఎమోషనల్ గా మీరు నన్ను ఇంటికి పంపిస్తారు అనుకోలేదని, ఏదో ఒకటి చేస్తారని అనుకున్నాను అని ఎక్కడో చిన్న ఆశ ఉండేదని చెప్పుకొచ్చాడు.

కాకపోతే ఎలిమినేషన్ అనేది అతను ఊహించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతిమాలుకొన్నాడు.తప్పై పోయింది అంటూ నాగార్జున వేడుకున్నాడు.ఆ తర్వాత అఖిల్ హౌస్ లోకి వెళ్లి తాను వెళ్లిపోతున్నట్లు తెలపడంతో ఇంటి సభ్యులు అందరూ కూడా ఒకింత షాక్ కు గురయ్యారు.అలా బిగ్ బాస్ హౌస్ వాళ్ల గురించి వారందరు చర్చించుకుంటూ ఉండగా సెల్ఫీ తీసుకొని రమ్మని అఖిల్ కు నాగార్జున తెలిపాడు.

అయితే అఖిల్ బయటకు వచ్చే ముందు ఇంటి సభ్యులు ఎవరు మంచివారు, నెగిటివ్ అని అడగగా.సోహెల్, మోనల్ ఫ్రెండ్స్ అని, ఇక నెగటివ్ లిస్టులో అభిజిత్, హారిక, లాస్య, మెహబూబ్ అని తెలిపాడు.

ఇందులో భాగంగా పాల గురించి అభిజిత్ అనుకున్న మాటలను తెలుపుతూ చివరకు కెప్టెన్సీ టాస్క్ లో చేసిన విషయాన్ని గుర్తు చేసి వారిని విమర్శించాడు.ఇదంతా అయిపోయాక ఎప్పటిలాగానే నాగార్జున అఖిల్ బయటికి వెళ్లడం లేదు అని చెప్పడంతో అందరూ ఎగిరి గంతేస్తారు.

ఆ తర్వాత బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చి అందులో గెలిచినందుకు అఖిల్ కెప్టెన్ అయ్యాడు .ఈరోజు గతవారం ఎలిమినేషన్ లో భాగంగా ఎన్నికైన హారిక, అరియనా, మహబూబ్, అభిజీత్, సోహెల్ లో ఎవరు సేఫ్ అనే విషయం లో అభిజిత్ సేవ్ అవ్వగా , నేడు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube