2,500 ఇస్తే కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ మీ చేతుల్లో!హాస్పిటల్ కొత్త దందా

కరోనా వైరస్ మనుషుల మధ్య దూరం పెంచేసింది.ఎంతలా అంటే సొంత కుటుంబంలో కూడా వారిని అంటరానివారిగా చూసే స్థాయిలో.

 Fake Covid-19 Negative Certificate Sold In Meerut Hospital, Corona Effect, Covid-TeluguStop.com

ఒకవేళ కరోనాతో మరణిస్తే కనీసం ఎలాంటి సంప్రదాయాలు లేకుండా శ్రర్ధ కర్మలు లేకుండా నేరుగా స్మశానంలో గుంతలు తీసే పాతేయడమే.అలాంటి దీనస్థితికి ఇప్పుడు మానవ సమాజం వచ్చేసింది.

అయితే ఈ స్థాయికి రావడానికి అంతా మన స్వయంకృతమే అని చెప్పాలి.మనం సృష్టిస్తున్న వైరస్ తిరిగి మనల్నే కబళించే స్థాయికి పరిస్థితి వచ్చేసింది.

అయితే ఎప్పటికప్పుడు కొత్త రోగాలు సృష్టిస్తూ వైద్యం పేరుతో దందా సాగించే ప్రయివేట్ హాస్పిటల్స్ లో చాలా వరకు కరోనా సమయంలో కూడా రోగులకి ట్రీట్మెంట్ చేయడానికి కూడా ముందుకి రావడం లేదు.అయితే మరికొన్ని హాస్పిటల్స్ కొత్త పద్ధతిలో దందా చేయడానికి కరోనాని ఉపయోగించుకుంటున్నాయి.

కరోనా ఉన్నా కూడామీరు భయపడాల్సిన అవసరం లేదు.కరోనా ఉన్నాగానీ లేనట్టుగా సర్టిఫికెట్ ఇస్తామని ఉత్తరప్రదేశ్ లో ఓ హాస్పిటల్ దందా మొదలెట్టింది.మీరట్ లో ఉన్న ఆ ప్రైవేటు ఆసుపత్రి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కు రేటు ఫిక్స్ చేసింది.2,500 చెల్లిస్తే కరోనా లేదంటూ డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తామని ప్రచారం షురూ చేసింది.ఓ వీడియోలో సదరు ఆసుపత్రి సిబ్బంది డబ్బులిస్తే కరోనా నెగెటివ్ సర్టిఫికె ఇస్తామంటూ చెబుతున్న విషయం వైరల్ గా మారడంతో పోలీసులు స్పందించారు.ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

తరువాత ఆసుపత్రి మూసివేయడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేశారు.ఆసుపత్రి అధినేత షా ఆలమ్ మాత్రం తమ ఆసుపత్రిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మరి నిజంగా దందా చేయడం నిజమా,లేదా అతని ఆరోపణలు నిజమా అనేది పోలీసుల విచారణలో తేలుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube