భర్తకు గండం ఉందంటూ మహిళ మెడలో తాళి కట్టిన దొంగబాబా!  

fake baba, tied mangalsutra, anothers wife, hyderabad, telangana - Telugu Anothers Wife, Fake Baba, Hyderabad, Telangana, Tied Mangalsutra

కాలం మారింది.రోజులు కొత్తవి వచ్చాయ్.

TeluguStop.com - Fake Baba Tied Mangal Sutra To Anothers Wife In Hyderabad

అయినా సరే మనుషులు మారలేదు.ఇంకా మూఢనమ్మకాలతో దొంగ బాబాలను నమ్ముతున్నారు.

వాళ్ళు చెప్పినవి ఎంత కరెక్ట్ అనేది ఆలోచించకుండా గుడ్డి వాళ్లలా చేస్తూ మోసపోతున్నారు.ఇక ఇప్పుడు కూడా అంతే భర్త మీద ప్రేమతో దొంగ స్వామీజీతో తాళి కట్టించుకుంది ఓ మహిళ.

TeluguStop.com - భర్తకు గండం ఉందంటూ మహిళ మెడలో తాళి కట్టిన దొంగబాబా-General-Telugu-Telugu Tollywood Photo Image

అసలు ఏమైందంటే.హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఓ వివాహితను మాధవ్ అనే వ్యక్తి జ్యోతిష్యుడిగా పరిచయం చేసుకున్నాడు.అయితే ఆమె జాతకం చూస్తాను అని మాయ మాటలు చెప్పి ఆమెను భయపెట్టాడు.ఆమెకు పక్షవాతం వస్తుందని, భర్తకు ప్రాణగండం ఉందని వెంటనే దోష నివారణ జరగాలంటూ ఆమెను భయపెట్టాడు.

దీంతో ఆమె నివారణ ఏంటి అని అడగగా.భర్త లేకుండా ఓ పూజ చేయాలి.అప్పుడే విముక్తి పొందగలరు అని చెప్పగా ఆమె దానికి ఒప్పుకుంది.దీంతో ఆ దొంగస్వామిజీ చెప్పినట్టు వెళ్లిన ఆమెకు ఊహించని రీతిలో మెడలో తాళి కట్టి షాక్ ఇచ్చాడు.

ఇక అప్పటి నుంచి ఆమె అతని భార్య అంటూ వేధించడం ప్రారంభించాడు.దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

దోషం అని చెప్పి తాళి కట్టి భార్య అంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఫోన్ కి అసభ్యకర మాసేజ్ లు, ఫోటోలు సెండ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, నకిలీ బాబా వేధింపులకు విసిగిపోయాను అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగబాబా మాధవ్ ను, అతని మిత్రుడు రాఘవ్ ను అరెస్ట్ రిమాండ్ కు తరలించారు.ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.

దొంగబాబాలను ఈ ప్రజలు ఎప్పుడు నమ్మడం మానేస్తారో ఏంటో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

#Fake Baba #Anothers Wife #Hyderabad #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fake Baba Tied Mangal Sutra To Anothers Wife In Hyderabad Related Telugu News,Photos/Pics,Images..