ఆడబిడ్డను మగ బిడ్డగా మారుస్తా అని ఆ బాబా చేసిన పని ఏంటో తెలుసా..?

వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న వైద్యులు కడుపులోని బిడ్డ విషయంలో మాత్రం మార్పులు చేయలేకపోతున్నారు.ఆడపిల్ల కావాలనుకునే వారికి ఆడపిల్లను, మగపిల్లాడు కావాలని కోరుకునే వారికి మగపిల్లాడే పుట్టేలాగా మాత్రం చేయలేకపోతున్నారు.

 Fake Baba Nailed Pregnant Woman To Turn Unborn Baby Into Male In Peshawar Detail-TeluguStop.com

ఎందుకంటే సృష్టి దర్మం అలాంటిది.కాబట్టి వైద్యశాస్త్రంలో కూడా ఇది సాధ్యం కాదనే విషయం డాక్టర్లకు తెలుసు.

అయితే ఒక నకిలీ బాబా మాత్రం ఏకంగా కడుపులో పెరిగే బిడ్డ యొక్క లింగాన్ని కూడా మార్చేస్తా అంటూ ఒక అభాగ్యురాలిని నమ్మించి ఆ గర్భిణి ప్రాణాలమీదకు తెచ్చాడు.గర్భంలో పెరిగే ఆడపిల్లను మగపిల్లాడిగా మార్చేస్తానంటూ నమ్మపలికాడు.

అసలు వివరాల్లోకి వెళితే.ఈ ఘటన పాకిస్థాన్ లోని పెషావర్ లో చోటుచేసుకుంది.

పెషావర్‌కు చెందిన ఓ మహిళకు పెళ్లి అయ్యాక వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో భర్త, అత్తమామల సూటి పోటీ మాటలు ఎక్కువ అయ్యాయి.ఈసారి అయినా సరే మగపిల్లాడు పుట్టకపోతే విడాకులు ఇచ్చేస్తామని బెదిరించారు.

ఈ క్రమంలో నాల్గొసారి గర్భం దాల్చింది.నెలలు నిండుతున్న కొద్దీ మళ్ళీ ఆడపిల్లే పుడుతుందనే భయం ఆమెలో పెరిగిపోయి ఈసారి అయినా మగపిల్లాడు పుట్టాలని దేవుళ్లకు మొక్కుకుంటోంది.

ఈ క్రమంలో ఓ బాబా గురించి తెలుసుకుని అతని వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది.అంతా విని ఆ బాబా నీ కడుపులో ఆడపిల్ల పెరుగుతున్నా సరే ఆ శిశువును మగబిడ్డగా మార్చేస్తాను అంటూ నమ్మబలికాడు.ఓ మేకును నువ్వు తలలో కొట్టించుకుంటే కడుపులో పెరిగేది ఆడపిల్ల అయినా సరే మగపిల్లాడిగా మారిపోతుంది అని గతంలో చాలామందికి ఇలాగే చేసానని చెప్పాడు.

అతడి మాయ మాటలను నమ్మి ఓ మంచి ముహూర్తం కూడా పెట్టుకుని ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలోనే ‘గర్భిణి తలలోకి మేకు దిపింపాడు.

అలా ఆ మేకు కాస్త తల లోపలకు దిగడంతో కుటుంబ సభ్యులు ఆ మేకును బయటకు తీసేందుకు ప్రయత్నించారు.ఫలితం లేకపోవడంతో వెంటనే పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.

పరీక్షలు చేసిన వైద్యులు మేకు మెదడును తాకకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఆ మేకును తీసివేశారు.అసలు తలలోకి మేకు ఎలా వెళ్లిందని డాక్టరు ప్రశ్నించగా.అసలు విషయం చెప్పారు ఆమె కుటుంబ సభ్యులు.అది విని డాక్టర్లు షాక్ అయ్యి వాళ్ళని మందలించి పోలీసులుకు విషయం చెప్పగా నకిలీ బాబాను అరెస్ట్ చేయటానికి సిద్ధమయ్యారు.

అయితే అసలు విషయం తెలిసి నకిలీ బాబా పరారు అయ్యాడు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఎక్స్ రేలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ననాయి.

Pakistan Fake baba drills nail into Pregnant Lady

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube