ఫేమ్ రావడంతో పటాస్ ప్రవీణ్ ను పక్కన పెట్టిన ఫైమా?

పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఫైమా పటాస్ కార్యక్రమంలో చేస్తున్న సమయంలోనే తను ప్రవీణ్ తో పరిచయం ఏర్పరచుకొని ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసిందని చెప్పాలి.ఈ విధంగా వీరిద్దరూ వీరి ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా వీరి వ్యవహార శైలి మాత్రం అలాగే ఉండేది.

 Patas Fame Faima Ignoring Praveen,faima, Jabardast, Patas Praveen, Tollywood, Te-TeluguStop.com

వీరిద్దరూ కలిసి ఎంతో చనువుగా ఉండటమే కాకుండా ప్రవీణ్ పలు సందర్భాలలో తన ప్రేమను బయటకు వ్యక్తపరిచినా ఫైమా నో అనే సమాధానం చెప్పకుండా నవ్వుతూ తన ప్రేమను అంగీకరించినట్టే వ్యవహరించేది.

ఇలా పటాస్ కార్యక్రమం ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో వీరిద్దరూ కలిసి ఒక కారు కొని హైదరాబాద్ వీదులు మొత్తం చక్కర్లు కొట్టారు.

అయితే వీరిద్దరూ తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చారు.ప్రవీణ్ రాకింగ్ రాకేష్ టీంలో ఉండగా ఫైమా బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఫైమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.అయితే ప్రవీణ్ కన్నా ఫైమాకు అధిక క్రేజ్ ఏర్పడటంతో తను ప్రవీణ్ ను పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Telugu Bullet Bhaskar, Faima, Jabardast, Patasfaima, Patas Praveen, Rakesh, Telu

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో ప్రవీణ్ తో కలిసి కనీసం మాట్లాడటం కూడా లేదని వార్తలు వినపడుతున్నాయి.వీరిద్దరి మధ్య ఏదో గొడవలు జరిగాయని అందుకే ఇద్దరు విడిపోయారనే వార్తలు బలంగా వినపడుతున్నాయి.ఎలాగైనా వీరిద్దరిని కలపాలనే జబర్దస్త్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫైమా మాత్రం ప్రవీణ్ తో మాట్లాడటానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.ఈ విధంగా వీరి గురించి ఇలాంటి వార్తలు రావడంతో చాలామంది ఫైమా వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube