ఫిబ్రవరి 24 లోపు ఇలా చేయకపోతే మీ గూగుల్ ప్లే మ్యూజిక్ డేటా డిలీట్ కావడం ఖాయం

గత ఏడాది డిసెంబర్ నెలలో గూగుల్ ప్లే మ్యూజిక్ అప్లికేషన్ అధికారికంగా నిలిపివేయబడింది.కానీ వినియోగదారులు తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన పాటలను, సేవ్ చేసుకున్న పాటలను, అప్లోడ్ చేసిన పాటలు, ఫేవరెట్ లైబ్రరీలను, ఇంకా ప్లే లిస్టు వంటి మ్యూజిక్ కి సంబంధించిన డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ సంస్థ వెసులుబాటు కల్పించింది.

 Failure To Do So By February 24 Will Result In The Deletion Of Your Google Play-TeluguStop.com

అయితే ఫిబ్రవరి 14 లోపు ప్లే మ్యూజిక్ వినియోగదారులు తమ డేటాను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.లేదా యూట్యూబ్ మ్యూజిక్ అప్లికేషన్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఎవరైతే ఈ రెండు పనులు చేయలేదో వారి డేటాను తమ మ్యూజిక్ అప్లికేషన్ నుంచి గూగుల్ సంస్థ శాశ్వతంగా డిలీట్ చేస్తుంది.

4G నెట్ అవైలబుల్ లోకి వచ్చిన తర్వాత ఎవరూ కూడా పాటల్ని డౌన్లోడ్ చేసుకోవడం లేదు.నేరుగా మ్యూజిక్ అప్లికేషన్లలో తమకు ఇష్టమైన పాటలను లిస్ట్ గా చేసుకొని వింటున్నారు.అయితే తమకు ఇష్టమైన పాటల లిస్టు డిలీట్ అయితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది.

మళ్లీ ఇష్టమైన పాటలను ఒక జాబితాగా చేసుకోవాలంటే తలప్రాణం తోకకి వస్తుంది.ఐతే తమ వినియోగదారులు ఇటువంటి ఇబ్బందులు పడకూడదనే గూగుల్ సంస్థ ముందుగానే గూగుల్ ప్లే మ్యూజిక్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అందరికీ ఈమెయిల్ చేస్తోంది.

Telugu Hours, Delete, Febth, Google Music-Latest News - Telugu

అయితే యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్ అప్లికేషన్ కి తమ డేటా ను నేరుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.యూజర్లు music.google.com లేదా తమ మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటాను ట్రాన్స్ఫర్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఉన్నఫలంగా గూగుల్ ప్లే మ్యూజిక్ అప్లికేషన్ నిలిపివేయడానికి కారణం యూట్యూబ్ మ్యూజిక్ అప్లికేషన్ ని పాపులర్ చేయడానికే అని తెలుస్తోంది.ఇప్పటికే చాలా మంది యూట్యూబ్ మ్యూజిక్ యాప్ కి షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది.వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఉండేందుకు గూగుల్ సంస్థ యూట్యూబ్ మ్యూజిక్ లో సరికొత్త ఫ్యూచర్స్ ని అందుబాటులోకి తెస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube