ఆడియన్స్ చేతిలో ఫెయిల్.. కాకపోతే బిగ్ బాస్ పాస్ ఇవ్వడంతో సేవ్ అయిన అవినాష్..!  

ప్రతివారం నామినేషన్ అంటేనే ఎంతో దూరం పరిగెత్తే అవినాష్ తాజగా ఎలిమినేట్ అయిపోయాడు.అవును, నిజంగానే అందరి కంటే తక్కువ ఓట్లు పడడంతో ఆయన ఎలిమినేట్ అయిపోయాడు.

TeluguStop.com - Fail In The Hands Of The Audience Otherwise Avinash Saved By Giving The Bigg Boss Pass

ఎలిమినేట్ అయిపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోవాలి కదా కాకపోతే ఇంటి నుంచి మాత్రం బయటికి వెళ్లలేదు.దీనికి ఒకేఒక్క కారణం అవినాష్ కు ఎవిక్షన్ ఫ్రీ పాస్ చేతిలో ఉండడమే.

దానిని అవినాష్ ఉపయోగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు.అవినాష్ తన చేతిలో వజ్రాయుధాన్ని ఉంచుకొని ఈ వారం అతను ఎలిమినేట్ అయినా కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లకుండా ఇంట్లోనే కొనసాగుతున్నాడు దీంతో గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్లలేదు.

TeluguStop.com - ఆడియన్స్ చేతిలో ఫెయిల్.. కాకపోతే బిగ్ బాస్ పాస్ ఇవ్వడంతో సేవ్ అయిన అవినాష్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ వారానికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ పెద్ద ఎత్తున భారీగా జరిగినా కూడా చివరికి అంతా ఉత్తుత్తే అయిపోయింది.ఇక కేవలం 3 వారాల్లోనే ఆట ఉండడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మెంబర్స్ కాకుండా మరో ఇద్దరు ఎవరు బయటకు వెళ్తారో ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా అందరూ ఊహించిన విధంగానే అవినాష్ ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.చివరికి అవినాష్ కు కూడా ఈ వారం తాను ఉంటానని నమ్మకం లేకపోవడంతో అనుకున్నట్లుగానే మోనాల్, అఖిల్, అరియనా సేవ్ అవ్వగా తక్కువ ఓట్లతో అవినాష్ ఎలిమినేట్ స్థాయికి చేరుకున్నాడు.

ఎట్టకేలకు గత వారంలో ఎవిక్షన్ పాస్ ఉండటంతో అవినాష్ బతికిపోయాడు.ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే అవినాష్ కంటే అరియయానా కూడా ఎక్కువ ఓట్లు సంపాదించుకొని సేవ్ కావడమే.

ఇందులో భాగంగానే చివరికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అవినాష్ ను ఎలిమినేట్ అయ్యావు అని చెప్పగా.దాంతో అవినాష్ అసలు కథ మొదలు పెట్టాడు.తాను ఇప్పుడు ఆట నుంచి ముందుకెళ్లాలా.? లేదా ఆగిపోవాలా .? అంటూ నాగార్జునను అవినాష్ అడిగాడు.అలా అనడంతో పాటు ప్రేక్షకులు ఎలిమినేట్ చేశారు ఇంకేం చేయాలంటూ కొత్త కహాని ని అందుకున్నాడు అవినాష్.

అయితే ఇందుకు సంబంధించి హోస్ట్ నాగార్జున అవినాష్ కు తిరిగి ఓ క్లాస్ పీకాడు.ఇందులో భాగంగానే ఈ మాట నువ్వు పాస్ ఉపయోగించక ముందు మాట్లాడేవాడివి కానీ పాస్ ఉపయోగించిన తర్వాత ఇలా మాట్లాడితే ఏంటి అర్థం అంటూ నాగార్జున అవినాష్ కు గట్టిగా క్లాస్ పీకాడు.

దీంతో ఇప్పుడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న అవినాష్ పై సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ మొదలయ్యాయి.దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉండగా రాబోయే రెండు వారాల్లో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి టాప్ ఫైవ్ మెంబర్స్ ని ఫైనలిస్ట్ లుగా ఆట ఆడనున్నారు.

#Akhil #Nagarjuna #Ariyana #Elimination #Biggboss4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు