నజ్రియా ఫహద్ ఫాజిల్ ప్రేమకథ మీకు తెలుసా..?

రాజా రాణి అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నజ్రియా పరిచయమయ్యారు.నటించింది తక్కువ సినిమాలే అయినా నజ్రియాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

 Fahadh Fassil And Nazriya Nazim Love Story Details Here,latest News Viral-TeluguStop.com

మరోవైవు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం తెలుగులో పుష్ప మూవీలో విలన్ రోల్ లో నటిస్తున్నారు.తెలుగులో ఇప్పటివరకు ఫహద్ ఫాజిల్ ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా ప్రేక్షకుల్లో మాత్రం ఈ నటుడు బాగానే గుర్తింపును సంపాదించుకున్నారు.

Telugu Fahad Fazil, Love Proposal, Lovestroy, Nazriya-Movie

నజ్రియా, ఫహద్ ఫాజిల్ భార్యాభర్తలనే సంగతి తెలిసిందే.తాజాగా ఒక సందర్భంలో ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ నజ్రియాతో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు.ఒకసారి తాను లవ్ లెటర్ తో పాటు ఉంగరం పెట్టి నజ్రియాకు ఇచ్చానని ఆ విధంగా తమ ప్రేమకథ మొదలైందని ఫహద్ ఫాజిల్ తెలిపారు.అయితే తన ప్రపోజల్ కు నజ్రియా యస్ చెప్పలేదని నో చెప్పలేదని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు.

నజ్రియాకు ప్రపోజ్ చేసిన సమయంలో తాను బెంగళూరు డేస్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చేసేవాడినని నజ్రియా చుట్టూ తిరగడం తనకు చాలా నచ్చేదని ఫహద్ పేర్కొన్నారు.తన కోసం నజ్రియా కొన్ని వదులుకుందని అవి వదులుకోవడం వల్ల తాను చాలా బాధ పడ్డానని ఫహద్ ఫాజిల్ అన్నారు.

తాను అప్పుడు మానసికంగా స్ట్రాంగ్ కూడా కాదని ఫహద్ ఫాజిల్ తెలిపారు.అలాంటి టైమ్ లో నజ్రియా తనకు ధైర్యం చెప్పిందని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు.

Telugu Fahad Fazil, Love Proposal, Lovestroy, Nazriya-Movie

నా లైఫ్ లోకి నజ్రియా వచ్చిన తర్వాత జీవితమే పూర్తిగా మారిపోయిందని ఫహద్ పేర్కొన్నారు.తన లైఫ్ లోకి నజ్రియా వచ్చిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయిందని ఫహద్ తెలిపారు.తన సక్సెస్ లో నజ్రియా పాత్ర ఎంతో ఉందని నజ్రియా హెల్ప్ లేకుండా తాను ఏ పని చేయలేనని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube