పుష్ప సినిమాలో ఫహద్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనట!

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‘.ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Sukumar, Pushpa Film, Fahad Fasil, Allu Arjun, Tollywood,latest Movie News,viral-TeluguStop.com

ఈ సినిమా అక్రమంగా రవాణా చేస్తున్న గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇక ఇందులో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు.

Telugu Allu Arjun, Fahad Fasil, Pushpa, Sukumar, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఇందులో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు.ఇప్పటివరకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వని ఫహద్ ఫాజిల్ కేవలం డబ్బింగ్ సినిమాలతో మాత్రమే కనిపించాడు.ఇక ఈయన తొలిసారిగా విలన్ పాత్రలో పుష్ప సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండగా.ఇందులో ఫహద్ నటన కోసం ఈయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మొత్తానికి ఫాహద్ ఫాజిల్ కు ఈ సినిమాలో ఎంట్రీ త్వరలోనే అని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.

ఈ సినిమా కథ పెద్దగా ఉండటంతో రెండు భాగాలుగా చేయనున్న సంగతి తెలిసిందే.ఇక మొదటి భాగం ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది.

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదాలు పడుకుంటూ వస్తుంది.దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా చేయాల్సి వస్తుంది.

ఇందులో ఫహద్ ఫాజిల్ ఎంట్రీ ఆగస్టు నెలలో ఉంటుందని తెలుస్తుంది.మొత్తానికి ఈయన ఎంట్రీ పై క్లారిటీ రాగా.

ఈ సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Telugu Allu Arjun, Fahad Fasil, Pushpa, Sukumar, Tollywood-Movie

ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా.టీజర్ తోనే ఓ రేంజ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది.పైగా ఫస్ట్ లుక్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇక దీంతో సినిమా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ హిట్ అని అభిమానులు అంటున్నారు.ఇక ఇందులో బుల్లితెర గ్లామర్ యాంకర్ అనసూయ, కమెడియన్ సునీల్ కూడా నెగెటివ్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube