అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్ అంటే బహుశా ఎవరు గుర్తు పెట్టుకోవచ్చు కానీ.ఫహద్ ఫాజిల్ అంటే అందరికీ టక్కున మళయాల స్టార్ హీరో గుర్తుకు వస్తారు.
ప్రస్తుతం మలయాళంలో ఎన్నో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈ నటుడు మొట్టమొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే బన్నీ హీరోగా తెరకెక్కుతున్నటువంటి “పుష్ప” సినిమాలో పుష్పరాజ్ తో పోటీ పడటానికి రంగంలోకి దిగుతున్నాడు.
ఇకపోతే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఫహద్ ఫాజిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
ఫహద్ ఫాజిల్ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారే.ఫహద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ కూడా దర్శకుడిగా పని చేసేవారు.
ఈ క్రమంలోనే ఫహద్ ఫాజిల్ 2002వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘కైయెతుమ్ దూరత్’ అనే రొమాంటిక్ చిత్రంలో నటించారు.ఈ చిత్రాన్ని తన తండ్రి ఫాజిల్ స్వయంగా తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది.
ఈ క్రమంలోనే నీవు నటనకు పనికిరాడు అంటూ చేసే విమర్శలు అతని ఎంతో మానసికంగా కృంగదీసాయి.ఈ క్రమంలోనే పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఫహద్ ఫాజిల్ ఎక్కడైతే కిందపడి అవమానాలు పొందాడు అక్కడే కెరటంలా పైకి లేయాలని భావించి 2009వ సంవత్సరంలో మరోసారి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.
ఎక్కడైతే నువ్వు పనికి రావు అంటూ తీర్పునిచ్చారో అక్కడే తానేంటో నిరూపించుకోవాలని భావించిన ఈ స్టార్ హీరో అన్న మాటను నిలబెట్టుకుని ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే “బెంగళూరు డేస్“అనే చిత్రం ద్వారా పరిచయమైన నటి నజ్రియా. ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ 2014వ సంవత్సరంలో పెళ్లి వరకు వెళ్ళింది.
ఈ విధంగా సినీజీవితంలోనూ, నిజజీవితంలోనూ అద్భుతమైన విజయాలను సాధించాడు.