పుష్ప కోసం వెయిటింగ్ అంటున్న ఫాహద్ ఫైజల్

మలయాళంలో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు ఫాహద్ ఫైజల్.మల్లు ఇండస్ట్రీలో ఫాహద్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది.

 Fahad Fazil Excited To Join Pushpa Shooting-TeluguStop.com

సమాజంలో ఉన్న కాంటెంపరరీ ఇష్యూలని తీసుకొని వాటి మీద విమర్శనాత్మకంగా సినిమాలు చేస్తూ సోషల్ మెసేజ్ ఇస్తూ ఉంటారు.అతని సినిమాలలో అనవసరమైన ఆర్బాటం కంటే బలమైన కంటెంట్ ఉంటుంది.

ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.ఈ కారణంగానే చాలా తక్కువ సమయంలో ఫాహద్ మలయాళం ఇండస్ట్రీలో నటుడుగా, హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

 Fahad Fazil Excited To Join Pushpa Shooting-పుష్ప కోసం వెయిటింగ్ అంటున్న ఫాహద్ ఫైజల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్న ఫాహద్ ఇప్పుడు కమల్ హసన్ సినిమా విక్రమ్ లో అలాగే తెలుగులో అల్లు అర్జున్ పుష్ప మూవీలో ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు.కమల్ హసన్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ తో చేయడం అంటే వారిద్దరూ తెరపై పోటీ పడి నటిస్తారనడంలో అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉంటే మరో వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సారి పక్కా మాసివ్ రోల్ లో నటిస్తున్న పుష్ప సినిమా కోసం సుకుమార్ వెతికి మరీ ఫాహద్ ఫైజల్ ని తీసుకొచ్చాడు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫాసిల్ పుష్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు కదా.అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది.ఎలా ఫీల్ అవుతున్నారు అనే ప్రశ్న మీడియా నుంచి వచ్చింది.దానికి ఫాహద్ సమాధానం ఇస్తూ సుకుమార్ తనకు కథ చెప్పారని, చాలా అద్బుతంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా చూశానని ఆ సినిమా తనకు భాగా నచ్చిందని, దానిని మించి ఈ సినిమా ఉండబోతుందని చెప్పాడు.ఈ సినిమా లో నటించేందుకు చాలా ఎక్సయిట్ అవుతున్నానని చెప్పారు.

ఈ సినిమా ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తో సినిమా కథాంశం ఉండబోతుందని కూడా చెప్పుకొచ్చాడు.

#Sukumar #Pushpa Shooting #Allu Arjun #Fahad Fazil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు