టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న RRR చిత్రంలో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటించబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
రామ్ చరణ్ రాజమౌళి చిత్రం పూర్తికాగానే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో పాల్గొననున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్న సంగతిని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను వెతకడం కోసం దర్శకుడు వేట మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ తాజా సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ చిత్రంలో విలక్షణ నటుడి పాత్రలలో, రామ్ చరణ్ కు గట్టిపోటీ ఇవ్వడానికి మలయాళ విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఫహద్ ఫాజిల్‌ను చిత్ర బృందం సంప్రదించినట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండటం చేత ఈ సినిమాలో చరణ్ కు గట్టిపోటీ ఇవ్వడం కోసం చిత్రబృందం ఫహద్ ఫాజిల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో నటించడం కోసం సదరు నటుడు ఒప్పుకొంటారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ తో పోటీపడుతున్న సంగతి మనకు తెలిసిందే.