దెబ్బ తగిలి రక్తం కారుతున్నా.. అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన డుప్లెసిస్..!

ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి .క్రికెట్ అభిమానులకు ఎంతో వినోదం పంచుతున్న ఐపీఎల్ ఆటగాళ్లు అప్పుడప్పుడు ఆశ్చర్యానికి కూడా గురిచేస్తున్నారు.

 Faf Duplessis With Excellent Fielding Though His Leg Is Injured In Ipl 2021-TeluguStop.com

తమ డెడికేషన్, టాలెంటెడ్ ఆట ప్రదర్శనతో అందర్నీ కట్టిపడేస్తున్నారు.తాజాగా డుప్లెసిస్ తన జట్టు పట్ల కనబరిచిన అంకితభావం తోటి ఆటగాళ్లతో సహా క్రికెట్ ప్రియులందరినీ వావ్ అనిపించింది.

ఆదివారం సాయంత్రం అబుదాబి వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ ఫలితం చివరి బంతికి తేలిందంటే ఎంత ఉత్కంఠ పోరు నడిచిందో అర్థం చేసుకోండి! ఆఖరి బంతిలో చెన్నై కేకేఆర్ ముందుంచిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

 Faf Duplessis With Excellent Fielding Though His Leg Is Injured In Ipl 2021-దెబ్బ తగిలి రక్తం కారుతున్నా.. అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన డుప్లెసిస్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనితో కేకేఆర్ విజయాల పరంపరకు కళ్లెం వేసినట్లయింది.

చెన్నై జట్టు గెలుపును ముద్దాడిందంటే అందులో డుప్లెసిస్ పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి.ఈ ఆటగాడు అద్భుతమైన క్యాచ్‌ను పట్టి కేకేఆర్ కెప్టెన్, విధ్వంసర బ్యాట్స్ మ్యాన్ అయిన ఇయాన్ మోర్గాన్ ను ఔట్ చేసాడు.10వ ఓవర్లో తొలి బంతిని ఇయాన్ మోర్గాన్ భారీ షాట్ కొట్టాడు.ఆ బంతిని క్యాచ్ పట్టేందుకు లాంగాన్ లో ఉన్న డుప్లెసిస్ వేగంగా పరిగెత్తి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్నాడు.తొలుత బంతిని క్యాచ్ పట్టుకున్న డుప్లెసిస్.

బౌండరీ లైన్ దాటుతానేమోనని క్షణాల్లోనే అలెర్ట్ అయ్యి బంతిని గాల్లోకి విసిరేశాడు.అనంతరం బౌండరీ లైన్ అవతల కాలుపెట్టి.

మళ్ళీ లైన్ లోపలకి వచ్చి గాల్లో ఉన్న బాల్ ను అందుకున్నాడు.దాంతో ఇయాన్ మోర్గాన్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు.

Telugu Csk Vs Kkr Match, Duplessis Leg Injured, Faf Duplessis Excellent Fielding, Fielding, Injuries, Ipl, Ipl 2021, Latest News, Leg Is Injured, Sports Update-Latest News - Telugu

వాస్తవానికి అంతకు ముందే జారిన ఓ మ్యాచ్ లో ఓ బ్యాట్స్ మ్యాన్ క్యాచ్‌ను పట్టేక్రమంలో డుప్లెసిస్ మోకాలికి గాయమైంది.అయినప్పటికీ తన గాయాన్ని లెక్కచేయకుండా సీఎస్కే జట్టులో కొనసాగుతూ దాన్ని గెలుపు తీరాల వైపు నడిపించాడు.రక్తం కారుతున్నా.సడలని డెడికేషన్ తో అత్యంత కష్టతరమైన క్యాచ్‌ను పట్టి శభాష్ అనిపించాడు.అందుకే అతనిపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.అతడి మోకాలికి రక్తం కారుతున్న ఫొటోలను షేర్ చేసి నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

#Ipl #Csk Kkr Match #Faf Duplessis #Duplessis

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు